25, ఫిబ్రవరి 2024, ఆదివారం

వీర్యకణాలు తక్కువగా ఉంటే క్యాన్సర్ ముప్పు

 వీర్యకణాలు తక్కువ ఉత్పత్తి అయ్యే పురుషుల కుటుంబ సభ్యులకు క్యాన్సర్ 3 ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది వేర్యకణాలు తక్కువగా ఉత్పత్తి అయ్యే లేదా అసలు ఉత్పత్తి కానీ పురుషుల కుటుంబ సభ్యుల ఎముకలు కీళ్లలో క్యాన్సర్లు అభివృద్ధి చెందే ముప్పు 156% పెరుగుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు ఇలాంటి వారిలో లింఫ్ క్యాన్సర్ 60 శాతం ఎక్కువగా ఉంటుంది ఇక టిష్యూ క్యాన్సర్ 56% థైరాయిడ్  క్యాన్సర్ రిస్క్ 54 శాతం పెరుగుతుంది వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉన్నదని పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు

అధిక ప్రోటీన్లు ధమనులకు హానికరం

 ప్రోటీన్లను మితిమీరి తీసుకోవడం వల్ల ధమనులు దెబ్బతింటాయని పెట్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనంలో వెళ్లడైంది ఆహారం ద్వారా అతిగా ప్రోటీన్లు తీసుకుంటే ధమనుల గోడలోను వాటి చుట్టూ కొలెస్ట్రాల్ తదితర పదార్థాలు చేరుతాయని దీనివల్ల ధమనులు కుంచుచుకుపోతాయని పరిశోధకులు తెలిపారు రక్త ప్రవాహానికి ఆటంకాలు కలగడం లేదా ధమనులు పగిలిపోవడం జరగవచ్చని తద్వారా రక్తం ముద్దలు కట్టవచ్చని పేర్కొన్నారు రోజు ప్రోటీన్ల నుంచి తీసుకునే కేలరీలు 22 శాతానికి మించితే ధమనులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు

ఎలక్ట్రానిక్ పరికరాల వేడి తగ్గించే హైడ్రోజన్

 బ్యాటరీల సాయంతో పని చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత సేపు పనిచేశాక వేడెక్కడం సర్వసాధారణం. అయితే ఒక్కోసారి ఈ వేడి వల్ల పరికరాలు పేలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది లేదంటే పరికరంలోని ఇతర భాగాలు దెబ్బతింటుంటాయి ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు అదే హైడ్రోజెల్ దీని ద్వారా ఎలక్ట్రానిక్ పరికరం త్వరగా చల్లబడటమే కాక దాని వేడి నుంచే విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు ఈ హైడ్రోజెల్ నీరు, నిర్దిష్ట అయాన్లతో నిండిన పాలియాక్రిల మైండ్ ఫ్రేమ్ వర్క్ తో ఉంటుంది.