25, ఫిబ్రవరి 2024, ఆదివారం

బ్లడ్ క్యాన్సర్ కట్టడికి కొత్త ఔషధం

 ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు కొత్త మందు కనుగొన్నారు రస్ ఫెయిర్ టైడ్ అనే ఔషధం మంచి ఫలితాలను ఇస్తున్నదని ఎర్ర రక్త కణాల అదన ఉత్పత్తిని తగ్గిస్తున్నదని పేర్కొన్నారు అమెరికాలో మౌంట్ సినాయి లోని వికాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నేతృత్వంలో 70 మంది రోగులపై ట్రైల్స్ నిర్వహించారు అనే ఔషధం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుందని దీంతో పాలిసితేమియా వేరా అనే ఒక విధమైన బ్లడ్ క్యాన్సర్ ను నియంత్రిస్తున్నట్లు నిరూపితమైందని పరిశోధకులు చెప్పారు

భాషల అనువాదానికి భాషిని

 భారతదేశంలో చాలా మతాలు ప్రాంతాలు ఉన్నాయి ఉపాధి లేదా ఇతర అవసరం నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి మాతృభాష తప్ప వేరే భాష రానివారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దేనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం భాషని పేరుతో కృత్రిమ మేధా ఆధారిత యాప్ను అభివృద్ధి చేసింది ఇది ఒక భారతీయ భాషను మరో   భాషలోకి అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషలోకి అనువదిస్తుంది ఈ యాప్ ను ఆండ్రాయిడ్ ఐఓఎస్ వేదికల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

కళ్లకు గంతలు కట్టుకొని అయోధ్యకు

 హైదరాబాద్ నుంచి కళ్లకు గంతలు కట్టుకొని బైక్ లపై అయోధ్యకు బయలుదేరిన మారుతి జోషి రామకృష్ణ అనే ఇద్దరు మెజీషియన్లు శుక్రవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు మీరు శనివారం ఉదయం కామారెడ్డి నుంచి అయోధ్యకు బయలుదేరగా స్థానిక విశ్వహిందూ పరిషత్ బజరంగ్ బిజెపి నాయకులు స్థానికుల అభినందించి సాగనంపారు దశాబ్దాల కల నెరవేరిన సందర్భంగా అయోధ్య బాలరాముడు దర్శించుకోవడానికి బయలుదేరినట్లు మెజీషియన్స్ తెలిపారు