25, ఫిబ్రవరి 2024, ఆదివారం

కళ్లకు గంతలు కట్టుకొని అయోధ్యకు

 హైదరాబాద్ నుంచి కళ్లకు గంతలు కట్టుకొని బైక్ లపై అయోధ్యకు బయలుదేరిన మారుతి జోషి రామకృష్ణ అనే ఇద్దరు మెజీషియన్లు శుక్రవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు మీరు శనివారం ఉదయం కామారెడ్డి నుంచి అయోధ్యకు బయలుదేరగా స్థానిక విశ్వహిందూ పరిషత్ బజరంగ్ బిజెపి నాయకులు స్థానికుల అభినందించి సాగనంపారు దశాబ్దాల కల నెరవేరిన సందర్భంగా అయోధ్య బాలరాముడు దర్శించుకోవడానికి బయలుదేరినట్లు మెజీషియన్స్ తెలిపారు



పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

 నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అర్హత కలిగిన నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు ఉద్యోగ ఆర్ఆర్బి బ్యాంకింగ్ ఎస్ఎస్సి అర్హత పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారిని శశికళ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ గంగారం తెలిపారు ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో ఉన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ tsstudycircle.co.in  ద్వారా మార్చి 6లోగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు మార్చి 10న జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు 11 జిల్లా బ్రాంచ్లో ఎక్కడైనా రెగ్యులర్ ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు రాష్ట్ర స్టడీ సర్కిల్ హైదరాబాద్ వద్ద సివిల్ సర్వీస్ల కోసం కోచింగ్ తీసుకున్న వారు అర్హులు కాదని తెలిపారు మరిన్ని వివరాలకు 7702175493,9951199460,9490511593 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి

 పురాణాలు ఇతిహాసాల ప్రేరణతో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అన్నారు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానంలో ధర్మ బీజం కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గరికపాటి హాజరై ప్రవచనాలు చేశారు రామాయణం భారతీయులకు మొదటి ఇతిహాసం అని ఒకే బాణం ఒకే మాట ఒకే రాముడు జీవితం ఆదర్శమని పేర్కొన్నారు చిన్నతనం నుంచే మన పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను నేర్పాలని సూచించారు అనంతరం గరికపాటి బిజెపి నేతలు ఘనంగా సన్మానించారు