24, ఫిబ్రవరి 2024, శనివారం

పిండం కూడా వదలని ప్లాస్టిక్ భూతం

 గర్భిణుల్లో మైక్రో ప్లాస్టిక్ రేణువులు పెరుగుతుండడం పట్ల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొత్త పరికరం ద్వారా గర్భిణుల మావిలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు గుర్తించినట్టు న్యూ మెక్సికో హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం సైంటిస్టులు 62 మంది గర్భిణుల శాంపిళ్లను పరిశీలిస్తే ప్రతి గ్రామ కణజాలంలో 6.5 నుంచి 790 మైక్రో గ్రాముల మైక్రో ప్లాస్టిక్ కనిపించింది. ఈ సంఖ్య చూడడానికి చిన్నదిగా కనిపించినా ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయని పరిశోధకులు అభిప్రాయ పడ్డారు. ఈ ప్లాస్టిక్ రేణువులు మొదట గర్భస్థ మావి ఆ తర్వాత ఈ భూమి పై ఉన్న మొత్తం క్షీరదాల జీవితాలపై ప్రభావం చూపుతుందని పరిశోధన కు నేతృత్వం వహించిన మాథ్యూ కాంపెన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇడ్లీ వడ తో జీవవైవిద్యానికి ముప్పు

 భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవవైవిద్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా 150 యొక్క వంటకాలపై జరిపిన పరిశోధనలలో 26 భారతీయ వంటకాల వల్ల జీవవైవిద్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట వాటిలో ఇడ్లీ వడ చానా మసాలా రాజ్మా చపాతి సహఫలు ఆహార పదార్థాలు ఉన్నాయి యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకుల అధ్యయనంలో పర్యావరణం పై ఆహార పదార్థాల ప్రభావం వెలుగు చూసిందట ఆహార ఉత్పత్తి జరిగే ప్రాంతాలలో రకరకాల జీవజాతులు ప్రభావితం అవుతాయని చెబుతున్నారు వ్యవసాయం చేసే ప్రదేశాలలో చీరలు పక్షులు ఉభయచరాలపై పడే ప్రభావం పై పరిశోధకులు అంచనా వేశారు బియ్యం పప్పు ధాన్యాలతో కూడిన పదార్థాల వల్ల జీవవైద్యానికి అధికం ఉందని పరిశోధనలో తెరిచారు భారత్లో బియ్యం పప్పు పంటల సాగుకు తరచుగా భూమి మార్పిడి అవసరమని దీనివల్ల అనేక జీవజాతులు ఆవాసాలను కోల్పోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు

నాగార్జునసాగర్ లో అరుదైన వాటర్ డాగ్

 ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి ఉభయచరజీవులు ఇవి కూడా ఒకటి అరుదైన ఈ నీటి కుక్కలు సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ రిజర్వాయర్లు సందడి చేస్తూ కనిపించాయి శివాలయం వీఐపీ పుష్కర ఘాట్ వద్ద ఈ వాటర్ డాగ్స్ కలియ తిరుగుతూ దీక్షకులకు కనివిందు చేస్తున్నాయి సందర్శకులు పెద్ద ఎత్తున వాటి వద్ద ఫోటోలు దిగుతూ వాటిని వీడియోలో బంధిస్తూ సందడి చేస్తున్నారు, ఆ రెండేళ్ల క్రితం ఇదే సాగర్ జలాల్లో అటవీశాఖ అధికారులు కొన్నింటిని గుర్తించారు ఆ తర్వాత కనిపించకుండా పోయి తాజాగా మళ్లీ గతంలో కంటే అధిక సంఖ్యలో దర్శనం ఇవ్వడం విశేషం ఈ జీవుడు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.