23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

27న నిధి ఆప్ కే నికత్

 నిధి ఆప్ కే నికత్ 2.0 ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ గణేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు క్లాసిక్ పేపర్స్ శ్రీనగర్ గ్రామం గుండారం కామారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ 25 లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు పిఎఫ్ చందాదారులు యజమానులు పింఛనర్లు తగిన ఆధారాలతో హాజరై ఫిర్యాదులు అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చని సూచించారు.

కనువిందు చేస్తున్న కవలలు


 కవలలను ఒక చోట ఒక జంటను లేదా రెండు మూడు జంటలను చూస్తుంటాం. అలాంటిది నిజామాబాద్ జిల్లాలోని చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ పాఠశాలలో ఎల్కేజీ మొదలుకొని తొమ్మిదవ తరగతి వరకు మొత్తం 19 కవల జంటలు ఉన్నాయి. మొత్తం 38 మంది చిన్నారులు రోజు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులను తికమక పెడుతూ సందడి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున కవలల దినోత్సవం సందర్భంగా గురువారం పాఠశాల యాజమాన్యం, పిల్లలతో ముచ్చటించగా ఇంత మంది కవలలు బడిలో చదువుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పాఠశాల యాజమాన్య ప్రతినిధి కొడాలి రామచంద్ర రావు చెప్పారు.


పాత రాతి యుగపు పనిముట్లు లభ్యం

 


వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం చిల్లాపూర్ సమీపంలో పాత రాతియుగం నాటి పనిముట్లు లభ్యమయ్యాయి స్థానికంగా ఆరవ తరగతి చదువుతున్న దొబ్బలి శివకుమార్కు ఓ రాతి పనిముట్లు దొరికింది దానిని తమ ఉపాధ్యాయుల సహకారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులకు చూపించాడు ఈ రాతి పనిముట్టు పొడవు 12.5 సెంటీమీటర్లు వెడల్పు 8.5 సెంటీమీటర్లు మందం 3.5 సెంటీమీటర్లు గా ఉంది ఈ రాతి పరికరం ఫోటోలను అంతర్జాతీయ చరిత్రకారుడు రవి కొరిసెంటర్ కర్ణాటక కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజీ హరగోపాల్ తదితరులు పరిశీలించి అది తొలిపాతరాతి యుగం రాతి పని ముట్టు తాటి గుడ్డలుగా నిర్ధారించారు ఈ పనిముట్టు వయసు కనీసం లక్ష సంవత్సరాలకు పైగా ఉంటుందని హరగోపాల్ చెప్పారు.