మార్చి మూడవ తేదీన చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజాంసాగర్ మండల వైద్యాధికారి రోహిత్ అన్నారు నిజాంసాగర్ పిహెచ్సిలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని ఐదేళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేయాలని అన్నారు పోలియో చుక్కలు వేసేందుకు 40 కేంద్రాలను ఒక మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు హెల్త్ సూపర్వైజర్లు మధు వెంకటనారాయణ సాయిలు పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
22, ఫిబ్రవరి 2024, గురువారం
స్కూల్ బ్యాగుల వితరణ
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన 225 మంది విద్యార్థులకు బుధవారం శ్రీరామ సేవా సమితి శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో బ్యాగులు నీళ్ల సీసాలు పాఠశాలకు మూడు పంకాలు వితరణ చేశారు ట్రస్ట్ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీణ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు
ఆలయాలలో ప్రత్యేక పూజలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం పండితులు ప్రత్యేక పూజలు చేశారు సుందరీకరణ పనులు భాగంగా రాతి గుమ్మం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు ఆలయ కమిటీ ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అన్నదానం చేశారు అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాత్రి భజన కార్యక్రమం చేపట్టారు ప్రతినిధులు పట్టణం రమేష్ నక్క శ్రీనివాస్ నూకల ఉదయ స్వామి తదితరులు పాల్గొన్నారు
వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన దోమకొండలో గోసంగి కాలనీలో బుధవారం నల్ల మారెమ్మ ముత్యాలమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది ఉదయం సర్వదేవత పూజలు హోమాలు యంత్ర సహిత అమ్మవారిల నూతన విగ్రహ ప్రతిష్టాపన కల్యాణోత్సవం నిర్వహించారు కోసంగి సంఘం ప్రతినిధులు నూనెల పుల్లయ్య పోశెట్టి రాజసం రాజేందర్ లక్ష్మీపతి శ్యామ్ పాల్గొన్నారు
బైరాపూర్ రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో బుధవారం భీష్మ ద్వాదశి పూజ నిర్వహించారు భక్తులు అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు బైరాపూర్ కు చెందిన దాతలు గంగారాం సాయి గౌడ్ గ్రామ ప్రజలకు అన్నదానం చేశారు
నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో శ్రీకృష్ణుడు ఆలయ నిర్మాణానికి సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గ్రామస్తులు బుధవారం భూమి పూజ చేశారు ఇందులో సాయిరాం మహేందర్ రమేష్ రామన్న తదితరులు ఉన్నారు
బీర్పూర్ లోని కోదండ రామాలయం ద్వితీయ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు పూజారులు శేషు ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం అలంకరణ తదితర పూజలు నిర్వహించారు అన్నదానం చేశారు ఎంపీపీ రఘు మేకల విట్టల్ గంగారాం సందీప్ లింగం రాజు దుర్గాప్రసాద్ బసవరాజ్ గంగాధర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు
నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయ నూతన కమిటీని గ్రామస్తులు బుధవారం ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా నారాయణ ఉపాధ్యక్షుడిగా అనుసూరి శ్రీనివాస్ కార్యదర్శిగా గుత్తుల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
అయోధ్యలోని రామ మందిరం దర్శనానికి బీర్కూరు మండలంలోని పలువురు భక్తులు బుధవారం తరలి వెళ్లారు తొలత బీర్కూరులోని శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు బరంగేడికి చెందిన లక్కపల్లి రాజు అనే యువకుడు అయోధ్య బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 10 రోజులు సేవ చేసినందుకు భాజపా నాయకులు సన్మానించారు భాజపా జిల్లా కార్యవర్గ సభ్యుడు సాయికిరణ్ శ్రీనివాస్ యోగేశ్వర్ గాలయ్య హనుమాన్లు పాల్గొన్నారు
ఎల్లారెడ్డి కరసేవకుడు నాయిని సాయిరాం విహెచ్పి బజరంగ్దళ్ జిల్లా సహా సంయోజక వినోద్ సభ్యుడు నవీన్ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య రామ మందిర దర్శనానికి బయలుదేరారు వారికి భాజపానేతలు వీడ్కోలు చెప్పారు



