21, ఫిబ్రవరి 2024, బుధవారం

అయోధ్యకు ప్రత్యేక రైలు

 అయోధ్య రామాలయ సందర్శనకు బుధవారం కామారెడ్డి నుంచి భక్తులు ప్రత్యేక రైలులో బయలుదేరి వెళ్లారు రైలు బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భక్తుల కోసం రైలు ఏర్పాటు చేశారని అన్నారు ఈ రైలు 1 345 మంది భక్తులతో కామారెడ్డి నుంచి బయలుదేరిందని అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు భక్తులు దర్శనం పూర్తి చేసుకుని ఈ నెల 26 వరకు కామారెడ్డికి చేరుకుంటారన్నారు కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆలయ భాస్కర్ పైడి ఎల్లారెడ్డి జైపాల్ రెడ్డి రంజిత్ మోహన్ మర్రి రామ్ రడ్డి తేలు శ్రీనివాస్ బాపురెడ్డి రాము భరత్ సురేష్ నరేందర్ పాల్గొన్నారు.

గంగామాత ఆలయ వార్షికోత్సవాలు

 కామారెడ్డి పెద్ద చెరువు వద్దగల గంగమ్మ దేవాలయం 22వ వార్షికోత్సవాలు ఈనెల 23 24 25 తేదీలలో నిర్వహించనున్నట్లు పట్టణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, గంగపుత్ర సంఘం ప్రతినిధులు జీ లక్ష్మీనారాయణ , పాకనారాయణ ,విజయ్ కుమారులు తెలిపారు .ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గం 2024

 భిక్కనూరు మండల కేంద్రం సమీపంలోని టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా - కాసాల నరస గౌడ్

 ఉపాధ్యక్షులుగా - అంబల్ల సాయి నిఖిల్ ,తమ్మల సిద్ధరాములు 

ప్రధాన కార్యదర్శిగా -  మన్నె రాజశేఖర్

 సహాయ కార్యదర్శులుగా - బల్ల రాజశేఖర్, స్వామి

 కోశాధికారిగా - బలవంత రెడ్డి 

తదితరులు ఎన్నికయ్యారు