అమెరికా నావికాదళం మాజీ డైవర్ బయో మెడికల్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ జోడి టూరి నీటి అడుగున వంద రోజులు నివసించి సరికొత్త రికార్డు సృష్టించారు .గతంలో నమోదైన 74 రోజుల రికార్డును చేరిపేసారు .సముద్రపు నీటి అడుగున ఎక్కువ కాలం నివసించవచ్చు అని ఆయన నిరూపించారు. సముద్రంలో 100 రోజుల పాటు నివసించిన అనుభవం తన జీవితాన్ని మార్చిందని ఆయన తెలిపారు. కొత్త విషయాలు తెలుసుకోవడం ,ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు .అన్ని హద్దులను చెరిపేసే విధంగా నూతన తరం పరిశోధకులకు తాను ప్రేరణగా నిలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
21, ఫిబ్రవరి 2024, బుధవారం
భారత్ జీ పీ టీ..హనుమాన్
ప్రారంభం వచ్చే నెలలో సేవలు ప్రారంభం
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న నూతన సాంకేతికలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఈ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడేలా హనుమాన్ పేరుతో సీతామహాలక్ష్మి హెల్త్ కేర్ సంస్థ ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆవిష్కరించింది ఏకంగా 22 భారతీయ భాషల్లో ఆరోగ్య సంరక్షణ పరిపాలన విద్య ఆర్థిక సేవలు తదితర రంగాలకు సంబంధించిన సేవలను అందించగలిగే ఈ ఎల్ ఎల్ ఎం ను బాంబే ఐఐటి నేతృత్వంలోని భారత జిపిటి ఎకో సిస్టం భాగస్వామ్యంతో ఆవిష్కరించారు . బాంబే ఐఐటీ తో పాటు మరో ఏడు ఇతర ఐఐటీ ల ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జిపిటి ఎకో సిస్టమ్ వాస్తవానికి ఒక రీసెర్చ్ కన్సార్టియం. ప్రముఖ పరిశ్రమికవేత్త ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఎస్ ఎం ఎల్ తోడ్పాటుతో ముందుకు సాగుతున్న ఈ కన్సార్టియం చాట్ జిపిటి తరహాలో సేవలందించే భారత్ జీపీటీ వచ్చే నెలలో ప్రారంభించనున్నది . స్పీచ్ టు టెక్స్ట్ ,టెక్స్ట్ టు స్పీచ్, టెక్స్ట్ టు వీడియో, వీడియో టు టెక్స్ట్ జనరేటింగ్ లాంటి బహుళ సామర్థ్యాలను కలిగి ఉన్న హనుమాన్ ఎల్.ఎల్.ఎమ్ ప్రస్తుతానికి హిందీ తమిళ్ తెలుగు మలయాళం మరాఠీ తదితర 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందిస్తుంది మునుముందు 22 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగలిగేలా సామర్థన్ని పెంచాలని భావిస్తున్నారు
అమ్మో వాయిస్ క్లోనింగ్
డీప్ ఫేక్ వీడియోల కలకలం ఒకవైపు కొనసాగుతుండగాని వాయిస్ క్లోనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి .ఇప్పటికే అమెరికా ఐరోపా దేశాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి. కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నకిలీ వాయిస్ ని సృష్టించడమే వాయిస్ క్లోనింగ్ గా నిపుణులు చెప్తున్నారు. నకిలీ వాయిస్ తో ఆర్థిక నేరాలకు పాల్పడడమే దీని ఉద్దేశమని వెల్లడిస్తున్నారు .ఎలా మభ్యపెడతారంటే.. లక్షత వ్యక్తికి సంబంధించిన వాయిస్ ను తోలుతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తర్ఫీదు ,ట్రైన్ చేసి చేసి అసలు వాయిస్ గా భ్రమించేలా క్లోనింగ్ చేస్తారు తర్వాత సదరు వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఆప్తుల ఫోన్ నెంబర్లకు కాల్స్ చేసి ఆ వ్యక్తి మాట్లాడినట్టుగా ఫేక్ సంభాషణలను కొనసాగిస్తారు ఆపదలో ఉన్నాం వెంటనే ఈ నెంబర్కు డబ్బులు పంపించాలంటూ విజ్ఞప్తి చేస్తారు డబ్బులు పంపించే వరకు పలు విధాలుగా మభ్యపెడతారు ఆత్మీయ లే ఫోన్ చేశారు కదా అంటూ అలా పలువురు పెద్ద మొత్తంలో డబ్బు పంపించిన ఉదంతాలు అమెరికాతో పాటు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూశాయి కూడా. అమెరికాలోని ఓ కంపెనీకి చెందిన సీఈవో ఇలా మోసపోయి ఏకంగా రెండు లక్షల 43 వేల డాలర్లను నీరగాళ్లకు పంపించినట్లు సమాచారం అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు కూడా వాయిస్ క్లోనింగ్ సెగ ఇటీవల తగిలింది ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు బయడేన్ చెప్పినట్లుగా ముందుగా రికార్డ్ చేసిన కొన్ని ఫేక్ ఫోన్ కాల్స్ పలుగురికి వెళ్లాయి ఎన్నికల్లో ఓటు వేయొద్దని బయడిన్ఓటర్లను కోరినట్లు ఆడియోలో ఉన్నది .కృత్రిమ మేధా ఆధారంగా సృష్టించిన ఈ ఫేక్ కాల్స్ పై వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది వాయిస్ క్లోనింగ్ నేరాల పట్ల క్లోనింగ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.