21, ఫిబ్రవరి 2024, బుధవారం

రోబోలతో ఫుడ్ డెలివరీ

 


జపాన్ లో వచ్చే నెల నుంచి ప్రారంభం

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రోబోల వినియోగం పెరుగుతున్నది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబేర్ ఈట్స్ వచ్చే నెల నుంచి జపాన్ లోని టోక్యోలో రోబోలతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నది. ఇన్దుదుకోసం మిత్సుబిషి ఎలక్ట్రిక్ అండ్ కార్ట్ కెన్ తో ఒప్పందం కుదూర్చుకుంది. ఈ అటానమస్ సైడ్ వాక్ రోబోలను కార్ట్ కెన్ కు చెందిన మోడల్ సి నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో రోబోలతో ఫుడ్ డెలివరీ చేయించడం ఇదే తొలిసారి కానున్నది నిజానికి జపాన్లో రోబోలవాడకం కొత్తేమీ కాదు ఏళ్ల తరబడి ఇక్కడ రెస్టారెంట్లు ఇది సేవలందిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి వీధుల్లో ఫుడ్ డెలివరీ చేస్తూ కనిపించడమే కొత్త వింత కాబోతున్నది ఫుడ్ డెలివరీ చేసే ఈ రోబోలు పాద చారులు నడిచే దారిని ఎంచుకుంటాయి. ట్రాఫిక్ సిగ్నల్ ను పాటిస్తాయి. ఇది నడుచుకుంటూ వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఆహారం చల్లారిపోదా. అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఈ సమస్యకు పరిష్కారంగా కార్గో బిన్ ను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం వీటిలో ఆహారం సరఫరా చేస్తే అప్పుడు వండినట్లుగానే ఉంటుందట

డయాబెటిస్ కు రెడ్ లైట్ థెరపీ

 బ్లడ్ షుగర్ స్థాయిలో 28 శాతం నియంత్రణ

ఎరుపు రంగు కాంతితో డయాబెటిస్ నియంత్రణలోకి తీసుకురావచ్చు అని దీనీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. భోజనం చేశాక మన శరీరంపై కొన్ని నిమిషాల పాటు 15 నుంచి 45 నిమిషాలు ఎరుపు రంగు కాంతి 670 నానో మీటర్ల పరిధి పడేట్లు చేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 28 శాతం తగ్గే అవకాశం ఉందని తద్వారా శరీరంలో చక్కెర స్థాయిలో నియంత్రణ నందుకు వస్తాయి యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు చెప్పారు. పరిశోధనకు నిత్యత్వం వహించిన డాక్టర్ మైఖేల్ పానర్ మాట్లాడుతూ శరీరంపై ఎరుపు రంగు కాంతి పడగానే జీవకణంలోని మైటోకాండ్రియా యాక్టివ్ అవుతుంది.  వెంటనే శక్తిని ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. భోజనం చేసిన తర్వాత గ్లూకోజ్ స్థాయి ఒకసారి గా పెరగకుండా ఇది అడ్డుకుంటుంది అని అన్నారు ఎల్ఈడి లైట్లు లో నీలిరంగు బ్లూ లైట్ కాంతి ఆరోగ్యానికి హాని చేస్తుందన్నారు .ప్రపంచమంతా ఇప్పుడు ఎల్ఈడి లైట్లు  వాడుతున్నందున ఈ ముప్పును గుర్తించాలని కోరారు.

మెదడు సంకేతాలను చదివే స్మార్ట్ బ్యాండ్

 ఒక స్మార్ట్ బ్యాండ్ ని తీసుకొస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించారు మనిషి మెదడులో కంప్యూటర్ మాస్క్ ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచి తన చుట్టూ ఉండే సాంకేతిక పరికరాలను కంప్యూటర్ మొబైల్ తదితరాలను నియంత్రించేందుకు ప్రాజెక్టుకు మూలం న్యూరాల్ టెక్నాలజీ సంకేతాలను అర్థం చేసుకునే కంప్యూటర్ సాంకేతికత ఇది జుకర్బర్కు కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ న్యూరాల్ టెక్నాలజీ ప్రాజెక్టును చేపట్టారు ఆధునిక టెక్నాలజీతో మనిషి మెదడును అనుసంధానం చేసే ఎలక్ట్రో మయోగ్రఫీ బ్యాండ్ ను మరికొద్ది సంవత్సరాల్లో మార్కెట్లోకి విడుదల చేస్తామని అన్నారు