21, ఫిబ్రవరి 2024, బుధవారం

రేపు జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

 కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ జట్లను శుక్రవారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగా వెంకటేశ్వర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కేంద్రంలోని లయోలా పాఠశాలలో సీనియర్స్ పురుషుల కబడ్డీ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎంపికైన వారు మార్చి 2 నుంచి 4 వరకు నాగార్జునసాగర్ లోని పైలాన్ కాలనీలో నిర్వహించే 70వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు ఎంపికలో పాల్గొనేవారు 85 కేజీల లోపు బరువు ఉండాలని ఆధార కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని పేర్కొన్నారు సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాణాల భాస్కర్ రెడ్డికి రిపోర్ట్ చేయాలని లేదా 9398571110 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని తెలిపారు

ఆధ్యాత్మికతతోనే ప్రశాంతమైన జీవితం

 ఆధ్యాత్మికతతోనే ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చని ఎమ్మెల్యే ప్రచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన దుర్గాదేవి ఆలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు కార్యక్రమంలో మల్లారం లింగేశ్వర ఆశ్రమం పీఠాధిపతి తపశ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి మండల సీనియర్ నాయకులు దొడ్ల వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్ జుబేర్ కౌన్సిలర్ సరిత తదితరులు పాల్గొన్నారు



ఆడబిడ్డ పుడితే రూపాయిలు 5000

 టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి నాడు బాల్కొండ మాజీ జెడ్పిటిసి జోగు సంగీత నరసయ్య వినూత్న కార్యక్రమం చేపట్టారు ముప్కాల్ మండల కేంద్రంలో ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి తన సొంత డబ్బులు 5000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు ఇందులో భాగంగా ముప్కాల్ లో ఓ చిన్నారి కుటుంబానికి బుధవారం 5000 రూపాయల డిపాజిట్ పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింగ్ దాసు ఉన్నారు