21, ఫిబ్రవరి 2024, బుధవారం

భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

 


మేడారం మహా జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర గిరిజనుల పండగ మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఇంటి వద్దకే సమ్మక్క సారలమ్మ ప్రసాదం బంగారు అందజేయాలని టిఎస్ఆర్టిసి అధికారులు నిర్ణయించారు గతంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తలంబ్రాలు బంగినపల్లి మామిడిపళ్ళు విజయవంతంగా మీ ఇంటి వద్దకే చేరవేశాము భక్తులకు మరింత దగ్గర అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పండగ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రసాదం బంగారంతో పాటు అమ్మవారి పసుపు కుంకుమను భక్తులకు టిఎస్ఆర్టిసి కార్గో వారు అందించనున్నారు ఈ సదవకాశం ఈనెల 25వ తేదీ వరకు భక్తులు నేరుగా లాజిస్టిక్స్ కౌంటర్ల వద్ద ప్రసాదం బుక్ చేసుకోవచ్చు ప్రసాదం బుక్ చేసుకునే భక్తులు నిజామాబాద్ రీజియన్ లోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్ల వద్ద 2009 రూపాయలు చెల్లించి బుకింగ్ టికెట్ పొందాలి ఈ ప్రసాదం బంగారం బుక్ చేసుకున్న వారికి జాతర పూర్తి అయిన తర్వాత ఆర్టీసీ సిబ్బంది భక్తుల ఇంటి వద్దకే వచ్చి ప్రసాదాన్ని అందజేస్తారు ఈ ప్రసాదాన్ని అందించిన సమయంలో మీరు మా సిబ్బందికి ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించిన అవసరం లేదని డి శ్రీనివాస్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నిజామాబాద్ తెలిపారు మేడారం ప్రసాదం బంగారం బుకింగ్ కొరకు నిజామాబాద్ రీజియన్ డిపో నెంబర్లు ఆర్మూర్ 9550232626 9014296638 నిజామాబాద్ వన్ మురళి 9154298727 నిజామాబాద్ టు సాయికుమార్ 7396889496 బాన్స్వాడ ఇర్ఫాన్ 9154298729 కామారెడ్డి రాజు 9154298730 ఆర్ ఎం ఆఫీస్ నిజామాబాద్ ఆర్ఎం ఈ కాశిరాం 8639969647 9154298731 నెంబర్లకు మాట్లాడి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నిజామాబాద్ కామారెడ్డి జాతరలో కు వెళ్లలేని భక్తులు ఆర్టీసీ అందిస్తున్న సువర్ణ అవకాశాన్ని సద్వినియం చేసుకొని ప్రసాదం బుక్ చేసుకోవాలని డిప్యూటీ ఆర్ ఎం సరస్వతి తెలిపారు ఈ సేవలు ఈనెల 25వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు

ఆర్టీసీ షాపుల వేలం

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్ పరిధిలో వివిధ డిపోలలో గల బస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న 62 ఖాళీ షాపులు ఖాళీ స్థలాలకు కాంట్రాక్టు జారీ చేసేందుకు వేలం ద్వారా టెండర్లు కోరుతున్నట్లు రీజినల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు ఫారాలను సంబంధిత డిపో మేనేజర్ కార్యాలయం నుండి ఈనెల 21 నుంచి 29 వరకు ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు పొందవచ్చు అని తెలిపారు పూర్తి చేసిన టెండర్ ఫారాలను మార్చి ఒకటి నాడు 10:30 నుండి 2 గంటల వరకు రీజినల్ మేనేజర్ కార్యాలయంలో గల టెండర్ బాక్సులు వేసి రసీదు తీసుకోవాలని పేర్కొన్నారు అదేరోజు మూడు గంటలకు టెండర్ బాక్స్ ఓపెన్ చేస్తామని మరిన్ని వివరాలకు ఆర్టీసీ వెబ్సైట్ చూడాలని సూచించారు

కాలభైరవ స్వామి ఆలయంలో టెండర్ ప్రకటన

 రామారెడ్డి మండలం ఇసనపల్లి గ్రామంలో వెలసిన కాలభైరవ స్వామి ఆలయంలో ఒక సంవత్సరం కొరకు తేదీ ఒకటి మార్చి 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు క్రింద తెలిపిన రాగిపాదుకలు వెండి పాదుకలు చందనము లామినేషన్ ఫోటోలు స్టిక్కర్ ప్యాకెట్ కిరాణా సామాను వంటచేరుకు కట్టెలు ప్రింటింగ్ వస్తువుల కొరకు భక్తుల నుండి గాని వ్యాపారస్తుల నుండి గాని తేదీ 22 ఫిబ్రవరి 2024 రోజున 1:00 వరకు సీల్డ్ కవర్లో ఆలయంలో సమర్పించవలెను అదే రోజు మూడు గంటలకు సీల్డ్ కవర్లను ఆలయ కార్య నిర్వహణ అధికారి సమక్షంలో మరియు ఇతర పెద్దల సమక్షంలో సీల్డ్ కవర్ ఓపెన్ చేయడం జరుగుతుంది వ్యాపారస్తులు ఇట్టి విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఈవో ప్రభు రామచంద్రం తెలిపారు