21, ఫిబ్రవరి 2024, బుధవారం

8 నుంచి జూబ్లీహిల్స్ లోని శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు

 హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి ఏడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి మరుసటి రోజు నుంచి ఉదయం 8 గంటల నుంచి తొమ్మిది గంటల దాకా రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు మార్చి 17 నా సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది తిరుపతిలో మంగళవారం బ్రహ్మోత్సవాల గోడపత్రికను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితరుల ఆవిష్కరించారు ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు పాల్గొన్నార

బద్ధకం వదలాలంటే ఏం చేయాలి

 


ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఒళ్ళు విరుచుకుంటాము ఎక్కువ సమయం పాటు కుర్చీలో కూర్చుని లేచిన ఇలాగే చేస్తాము అనాలోచితంగా చేసే ఈ చర్యతో శరీరంలోని కండరాలు వదులై మెదడు చురుకుగా మారుతుంది అయితే ఇదే ఫలితాన్ని ఇచ్చే యోగాసనాలు కూడా ఉన్నాయి

బాలాసనం ..పసిపిల్లలను పోలిన ఈ భంగిమతో బిరుదులు పిక్కలు తొడలతో పాటు ఉదరం దగ్గర కండరాలు సాగుతాయి

 త్రికోణాసనం ..నడుము కింది భాగం కాళ్లలోని కండరాలు స్ట్రక్చర్ అవుతాయి ఎక్కువ సమయం పాటు ముడుచుకుని ఉన్న కాళ్లకు రక్త ప్రసరణ మెరుగవుతుంది

 అధోముఖ శవాసనం.. ఈ ఆసనంతో ఉదారం భుజాలు జాతి దగ్గరికి కండరాలు సాగుతాయి చాతి ప్రదేశంలో పట్టేసినట్లు అనిపించే భావన తొలగుతుంది.

కాలభైరవ స్వామి ఆలయంలో సింధూర పూజలు

 రామారెడ్డి మండలం ఇసనపల్లి రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం స్వామి పర్వదినం కావడంతో పురోహితులు శ్రీనివాస్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య భైరవునికి క్షీరాభిషేకం సింధూర పూజలు అర్చనలు హారతి వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం స్వామి వారి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు స్వామివారి దర్శనం కోసం కామారెడ్డి జిల్లా నుంచి కాకుండా నిజామాబాద్ ఆదిలాబాద్ పక్క రాష్ట్రాలను మహారాష్ట్ర కర్ణాటక ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం గుప్తా జూనియర్ అసిస్టెంట్ సురేందర్ గుప్తా మాజీ ధర్మకర్తలు ప్రజాప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు