21, ఫిబ్రవరి 2024, బుధవారం

ఇవి మార్చితే చావును ఏ మార్చినట్లే

 మన నిత్యజీవన విధానం అలవాట్లు వంటివి మన జీవితకాలం పై ప్రభావం చూపుతాయని తెలిసింది మరి ఏ అలవాట్లు పద్ధతులు మార్చుకుంటే మరణం మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా దానిపై ఒక విస్తృత అధ్యయనం జరిగింది 2011-19 మధ్య 42 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మంది పై జరిగిన పరిశోధనల్లో ఆరు కీలక అంశాలను గుర్తించారు వీటిని పాటించని వారితో పోలిస్తే పాటించే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందని తేల్చారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారితో పోలిస్తే వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు మానసిక ఒత్తిడి ఆందోళనలను నియంత్రించుకోగలిగితే 29% డ్రగ్స్ కు దూరంగా ఉంటే 38% మరణం రిస్క్ నువ్వు తప్పించుకున్నట్లేనని తేల్చారు 

దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది

శారీరకంగా చురుగ్గా ఉంటే 46% ధూమపానం అలవాటు లేకుంటే 30% ఆరోగ్యకరమైన శాఖాహారం తీసుకుంటే 21% మద్యం అలవాటును బాగా తగ్గించుకుంటే 19% ఏడు నుంచి తొమ్మిది గంటల రాత్రి నిద్రపోతే 18% సానుకూల సామాజిక సంబంధాలు ఐదు శాతం ఈ ఆరింటిలో కనీసం ఒకదానిని పాటిస్తే 26% మూడింటిని పాటిస్తే 50 శాతం మొత్తం ఆరింటిని అలవాటు చేసుకుంటే 73% మరణ ప్రమాదం తగ్గుతుంది

వేలెడు అంత బారెడు అంత

 ప్రపంచంలోనే అత్యంత పొడవైన అబ్బాయి అత్యంత పొట్టి అమ్మాయి ఇద్దరు ఒకే చోట చోరితే ఇదిగో ఇలా ఉంటుంది ఇతడి పేరు సుల్తాన్ కోసం వయసు 41 ఏళ్లు టర్కీకి చెందిన కోసిన్ పొడవు ఏకంగా ఎనిమిది అడుగుల మూడు అంగుళాలు మరి ఈమె పేరు జ్యోతి ఆమెకి వయసు 30 ఏళ్లు ఇండియాకు చెందిన ఈమె పొడువు కేవలం రెండు అడుగులే ఇద్దరి మధ్య తేడాని ఆరడుగుల కన్న ఎక్కువ సుమారు ఆరేళ్ల కింద ఈజిప్టు పిరమిడ్ల దగ్గర ఈ ఇద్దరితో నిర్వహించిన ఫోటోషూట్ అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది మళ్ళీ రెండు రోజుల కింద అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో ఫోటోషూట్ కోసం వారిద్దరూ కలిశారు అక్కడ తీసిన చిత్రాలే ఇవి.




 అకౌండరో ప్లాస్టియాగా పిలిచే లోపం వల్ల జ్యోతి ఎదుగుదల లేక మరుగుజ్జులా ఉండిపోతే పెట్టుటరి గ్రంధిలో ట్యూమర్ తో గ్రోత్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తి కోసం ఇలా భారీగా ఎదిగిపోయాడు

మార్చి 13 నుంచి ఫైర్ మాన్ కు శిక్షణ

 తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అగ్నిమాపక సేవల శాఖలో ఇటీవల భర్తీ అయిన ఫైర్ మెన్ల శిక్షణ మార్చి 13 నుంచి ప్రారంభం కానుంది రంగారెడ్డి జిల్లా వట్టి నాగులపల్లి లోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇటీవల నియామకాలు మొత్తం 599 మంది ఫైర్ మాన్ ల ఎంపిక పూర్తిగా పూర్తయింది వీరిలో ఇప్పటికే 499 మంది అభ్యర్థుల మెడికల్ పరీక్షలు స్పెషల్ బ్రాంచ్ ఎంక్వయిరీ కూడా పూర్తవడంతో వారందరికీ శిక్షణలో చేరేందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులను ఆదేశాలు వెళ్లాయి ఇంకో 108 మంది అభ్యర్థుల ఎస్బి ఎంక్వైరీ మెడికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి.