18, ఫిబ్రవరి 2024, ఆదివారం

తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ 2024

 తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ సెక్రటరీగా కిరణ్ చారి ఎన్నికయ్యారు శనివారం హైదరాబాదులో అసోసియేషన్ ఏజీఎం ఎన్నికలు నిర్వహించారు ప్రెసిడెంట్గా వి నవీన్ యాదవ్ సెక్రటరీగా కిరణ్ ట్రెజరర్ గా వెంకట్ కోము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొత్త కార్యవర్గం త్రోబాల్ వార్షిక క్యాలెండర్ ను ప్రతిపాదించడంతోపాటు హైదరాబాదులో జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహణ ప్లాన్స్ పై చర్చించింది



పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిజ్జు దత్తాత్రేయ

 పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ టౌన్ కు చెందిన బిర్జు దత్తాద్రి ఎన్నికయ్యారు పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక కోసం ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించగా అధ్యక్ష పదవికి బిజ్జు దత్తాత్రే ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పులగం హనుమాన్లు ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం ట్రెజరర్ గా గుడ్ల భూమేశ్వర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి దత్తాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో శనివారం ఆర్మూర్లోని ఆయన నివాసంలో 8వ తర్ప అధ్యక్షుడు కొక్కుల రమాకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో చిలుక కిష్టయ్య బొడ్డు గంగాసాగర్ బండి రాజు దాసరి కృష్ణ మేక శ్రీను బ్రహ్మదండి దిలీప్ దాసరి రాధా కిషన్ పాల్గొన్నారు




రాయిని మడత పెట్టి

 ఇరవై టన్నుల బరువు ఉన్న బండరాయిని మడత పెట్టడం సాధ్యమా మరి ఇక్కడ కుర్చీ మడతపెట్టినంత ఈజీగా మడత పెట్టేశారు చూశారా ఫోల్డ్ సిరీస్ లో భాగంగా గ్రానైట్ రాయితో ప్రముఖ శిల్పి జాతీయ అవార్డు గ్రహీత దుర్గడ్డ హరిప్రసాద్ ఆచారి ఈ ఆధునిక శిల్పాన్ని మలిచారు హైదరాబాదులోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా న్యూస్ లో ఈ మడత శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచారు అసలు రాయని ఎలా మడత పెట్టారు అనేది శిల్పంగా తీర్చిదిద్దారు సాధారణంగా మనం ఏదైనా కఠినమైన దాన్ని బండరాయితో పోలుస్తాం. అందులోనూ గ్రానైట్ అత్యంత కఠిన శిల దీనికి పూర్తి భిన్నంగా మనిషి సున్నిత మనస్కుడు అయితే మనుషులు తలుచుకుంటే ఎంత కఠినమైన రా ఇలాంటి దానైనా తమకు నచ్చినట్లుగా మార్చేయగలరని ఈ శిల్పాల ఉద్దేశం అని హరిప్రసాద్ చెప్పారు మార్చి 7 వరకు మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగే న్యూస్ ఆర్ట్ ఫస్ట్ ఎగ్జిబిషన్లు ఇలాంటి అనేక శిల్పాలు సందర్శకులు ఆదర్శించడానికి ఆకర్షించడానికి సంసిద్ధంగా ఉన్నాయి మరెందుకు ఆలస్యం చలో మరి