18, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఆధ్యాత్మిక సమాచారం 18 ఫిబ్రవరి

 గాంధారి మండలం నేరల్ తండాలో ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు మాజీ ఎంపీపీ దశరథ నాయక్ మాజీ సర్పంచి కామోజీ బాయ్ తండా నాయకులు చందా నాయక్ భజన లాల్ మ్యాల్ సింగ్ ప్రకాష్ నర్సింగ్ బిచ్చం నెహ్రు భగత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని వృషభ లింగ శివాచార్య మత సంస్థాన్ లో మఠాధిపతి బసవలింగ శివాచార్య ఆధ్వర్యంలో వసంత పంచమి రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శనివారం తెల్లవారుజామున రథాన్ని ఊరేగించారు మహాదేవుని మందిరం వద్ద నిర్వహించిన అగ్నిగుండంలో భగభగ మండే నిప్పురవ్వలపై నడుస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు మరాఠీ కన్నడ భాషలో చేసిన భజనలు కీర్తనలు ఆకట్టుకున్నాయి వ్రతం ఊరేగింపులో భక్తులు శివసత్తుల వేషధారణతో పాల్గొన్నారు అనిత సింగ్ శంకర్ పటేల్ బోడ సాయిలు వీరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

19 నుంచి కనకదుర్గమ్మ స్థిర ప్రతిష్ట ఉత్సవాలు బాన్సువాడ పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ స్థిర ప్రతిష్ట ఉత్సవాలను ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు సరస్వతి దేవి ఆలయంలో శనివారం ఉత్సవాలకు సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించారు అర్చకులు సంతోష్ శర్మ ప్రతినిధులు సత్యనారాయణ తుకారాం రాజు నర్సిగొండ విజయ్ శ్రీనివాస్ సాయిలు తదితరులు పాల్గొన్నార

మండలంలోని తెలంగాణ తిరుమలలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు ఉదయం సుప్రభాతం ఆరాధన అష్టోత్తర నామ పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పరావు మేనేజర్ విట్టల్ అర్చకుడు నందకిషోర్ పాల్గొన్నారు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు భక్తులు కోవూరి రవికుమార్ జ్యోతి రాణి ఆధ్వర్యంలో 5100 విరాళం శనివారం అందజేశారు ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ధర్మకర్త కంచర్ల మధు కోరారు

పిట్ల మండల కేంద్రంలోని రాజరాజేశ్వరాలయం రాజన్న కుంటలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామి వారికి అర్చనలు అభిషేకాలు చేశారు పిట్లం కు చెందిన సాయి ప్రసాద్ శివ స్వాములకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు




వృత్తి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

 రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2023 24 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి కల్పనా నిమిత్తం మైనారిటీ అభ్యర్థులకు పలు అంశాల్లో శిక్షణ నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు పదో తరగతి పాసైనవారికి ఎమ్మెస్ ఆఫీస్ పదో తరగతి లోపు వారికి టైలరింగ్ ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అకౌంటెంట్ అసిస్టెంట్ యూజింగ్ టాలీ కోర్సుల శిక్షణ ఇవ్వాలని ఉన్నట్లు తెలిపారు అభ్యర్థుల వయసు 18 నుంచి 404 మధ్య ఉండాలని పట్టణవాసులకు రెండు లక్షల రూపాయల లోపు గ్రామీణ ప్రాంతాల వారికి ఒకటిన్నర లక్షలుపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులన్నారు దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు ఆహార భద్రత కార్డు ఆదాయ ధ్రువీకరణ విద్యార్హత పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేసి కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో ఈనెల 19 వరకు సమర్పించాలన్నారు



19న ఉద్యోగమేళా

 నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈనెల 19 నా ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు 10 ఇంటర్ డిగ్రీ ఫార్మసీ పిసిఐ పూర్తి చేసి 18 నుంచి 30 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు ఆసక్తికర అభ్యర్థులు సోమవారం ఉదయం 10 గంటలకు ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించే మేలకు హాజరు కావాలని పేర్కొన్నారు బయోడేటా ఆధార్ కార్డు పిపి పోటీలు ఫోటోలు ధ్రువపత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు