16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

స్కాన్ చేయండి ఆహార వివరాలు తెలుసుకోండి

 న్యూట్రిఎడ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన ఎన్ఐఎన్

మనం తింటున్న ఆహారంలో పోషక విలువలు ఏమున్నాయి ఒంటికి కావాల్సిన ఖనిజ లవణాలు అందుతున్నాయా ఇలా మనం తీసుకునే ఆహారంలోని వివరాలు తెలియజేసే న్యూట్రిఎయిడ్ యాప్ ను జాతీయ పోషకాహార సంస్థ అందుబాటులోకి తెచ్చింది ఎండో జర్మన్ పరస్పర సహకారంతో రెండు సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనలు చేసి దీనిని అభివృద్ధి చేశారని ఎన్ ఐ ఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత చెప్పారు గురువారం తార్నాకలోని ఎన్ ఐ ఎన్ లో జర్మన్ శాస్త్రవేత్తలతో కలిసి దీనిని ప్రారంభించారు ఈ యాప్ ద్వారా మనం రోజు తీసుకునే ఆహారంలో ఉప్పు చక్కెర కొవ్వు, శాతాల వివరాలు తెలుస్తాయి అన్నారు వెబ్సైట్లో మరిన్ని వివరాలు ఉంటాయి.. nutriaide.org







15, ఫిబ్రవరి 2024, గురువారం

హైదరాబాద్ శివార్లు 800 ఏళ్ల నాటి గణేశుని శిల్పం

 హైదరాబాద్ నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణి చాళుక్యుల కాలపు గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారులు తెలిపారు చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఎస్ జై కిషన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు శ్రీరామోజు హరగోపాల్ బివి భద్రగిరి శనివారం నాడు శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ గ్రామంలోని భగీరథ శివాలయం ఆంజనేయాలయంలోని చారిత్రక శిల్పాలను పరిశీలించారు శివాలయం ముందు మూడు అడుగుల వెడల్పు నాలుగడుగుల ఎత్తు రెండు అడుగుల మందంతో నల్ల శారపు రాతిలో చెక్కిన గణేశుని రెండు చేతుల్లో దంతం కుడుము ఉన్నాయని తలపై చిన్న కిరీటం లలాటహారం ఉదయ బంధం నాగ యజ్ఞోపవీతం బాహుబలి యాలు కంకణాలు కాళ్లకు కడియాలు ధరించి లలితాసనంలో కూర్చుని ఉన్నాడని ప్రతి మా లక్షణాన్ని అనుసరించి ఈ విగ్రహం క్రీస్తు శకం 12వ శతాబ్దికి చెందిన కళ్యాణి చాళుక్య శిల్ప శైలికి అద్దం పడుతుందన్నారు ఇంకా అక్కడ అద్భుతమైన శిల్పాలు ఉన్నాయని చారిత్రక వివరాలతో కలకాలం ఏర్పరిచి భద్రపరిచి భావితరాలకు అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు



తల్లికి సాయంగా ఉండడం గృహహింస కాదు

 భర్త తన తల్లితో సమయం గడపడం ఆమెకు డబ్బు ఇవ్వడం గృహహింస కాదని సెషన్స్ కోర్టు పేర్కొంది ఈ సందర్భంగా దిగివకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది ఆ రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళ తన భర్తతోపాటు అత్తింటి వారిపై గృహహింస కింద కోరుకున్నాశ్రయించింది తల్లి మానసిక రోగాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నాడు అని ఆరోపించింది తాను ఉద్యోగం చేయడానికి అత్త వ్యతిరేకించిందని తనను వేధిస్తున్నారని పిటిషన్లు పేర్కొంది తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబర్ 2004 వరకు ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని సెలవు పై భారత్కు వచ్చినప్పుడు తల్లిని కలిసే వాడని ఆమెకు ప్రతి యేటా పదివేల రూపాయలు పంపేవాడిని పిటిషన్లు ఆరోపించింది తల్లి కంటి ఆపరేషన్ కోసం కూడా డబ్బు ఖర్చు చేశాడని పేర్కొంది గృహహింస మహిళల రక్షణ చట్టం కింద రక్షణ ఉపశమనం కల్పించడంతో పాటు పరిహారం ఇప్పించాలని మెజిస్ట్రేట్ కోర్టును కోరింది మరోవైపు ఆ మహిళ అభ్యర్థన పై విచారణ పెండింగ్లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు ఆమెకు నేలకు ₹3,000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది అయితే పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాత గృహహింస క్రింద ఆమె దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది అలాగే మద్యంతర భరణాన్ని రద్దు చేసింది దీంతో ఆ మహిళ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను ముంబైలోని సెషన్స్ కోర్టులో సవాల్ చేయిగా ఇక్కడ చుక్కెదురైంది