11, ఫిబ్రవరి 2024, ఆదివారం

మల్టీ జనరేషన్ పార్క్ ఎంట్రీ ఫీజు పది రూపాయలు

 బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు కట్టకింద నూతనంగా నిర్మించిన పిఎస్ఆర్ మల్టీ జనరేషన్ చిల్డ్రన్ పార్కులలో ఈ నెల 12 నుంచి ఎంట్రీ ఫీజు 10 రూపాయలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారుకు నిర్వహణ నిమిత్తం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పార్క్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు



మార్చి 3న జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు

 మార్చి మూడున నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దికొండ యాదగిరి అన్నారు శనివారం నగరంలోని పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పద్మశాలి సంఘం సలహాదారుడిగా డాక్టర్ సత్యనారాయణ ను ఎన్నికల అధికారిగా నియమించినట్లు చెప్పారు అధ్యక్ష కార్యదర్శులతో పాటు 21 పదవులకు ఎన్నికలు జరుపుతామని అన్నారు ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ 17న స్కూటీని 18 నుంచి 19 వరకు ఉపసంహరణ ఉంటుందన్నారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారు ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణకు నామినేషన్ పత్రాలను సమర్పించాలని అన్నారు జిల్లాలోని పద్మశాలి సంఘ సభ్యుడు తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు గురు చరణ్ గుడ్ల భూమేశ్వర్ దేవి దాస్ గంగా దాస్ తదితరులు పాల్గొన్నారు




గంగపుత్ర సంఘం కార్యవర్గం ఎన్నిక

 ఇందల్వాయి మండల గంగపుత్ర సంఘ నూతన కార్యవర్గాన్ని శనివారం మండల సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా - ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్

 ఉపాధ్యక్షుడిగా - ప్రవీణ్ గౌరారం ,స్వామి సిర్నాపల్లి

 కార్యదర్శిగా - హనుమంతు ఇందల్వాయి 

కోశాధికారిగా - బైసా గంగాధర్ ఇందల్వాయిలను

 ఎన్నుకోవడం జరిగిందన్నారు.