9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ప్రభుత్వ కళాశాలలో షార్ట్ టైం కోర్సులకు ప్రవేశాలు

 భీమ్గల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సార్ టైం కోర్సులకు దరఖాస్తులు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ అబ్బా చిరంజీవి తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అబ్బా చిరంజీవి మీడియా ద్వారా మాట్లాడుతూ షార్ట్ టైం కోర్సులకు విద్యార్థులు తీసుకురావాల్సిన నమూనా పత్రాలు ఫీజు చెల్లింపు 20 మార్చి 2024 లోపు ప్రవేశాలు పొందవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు వివరాలు కు కళాశాల అధ్యాపకుడు రామ్ చందర్ 7 9 8 9 33 6 0 0 7 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు

మహాలక్ష్మి కాలనీ నూతన కార్యవర్గం 2024

 ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్లోని 

మహాలక్ష్మి కాలనీ నూతన కార్యవర్గాన్ని 2024 గురువారం ఎన్నుకున్నారు

 మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా -  బాలయ్య రావు గణేష్

 ఉపాధ్యక్షుడిగా - ఇందూరు విజయకుమార్

 కార్యదర్శిగా - గుడ్ల శ్రీనివాస్ 

సంయుక్త కార్యదర్శిగా - కర్త నవీన్ 

కోశాధికారిక - తాటికొండ కిషన్లను 

ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఐదవ వార్డు కౌన్సిలర్ బండారి ప్రసాద్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ పాలెపు రాజును కమిటీ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో సాయిరాం దయాకర్ కాలనీవాసులు పాల్గొన్నారు



రేపు రాష్ట్రస్థాయి ఉర్దూ సాహితీ సమ్మేళనం

 దోమకొండ మండల కేంద్రంలోని గడి కూటలో శనివారం రాష్ట్రస్థాయి ఉర్దూ సాహితీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు గడికోట సీనియర్ మేనేజర్ బాబ్జి తెలిపారు ఉదయం 10:30 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగుతుందన్నారు చీఫ్ గెస్ట్ గా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పెషల్ గెస్ట్ గా ఎస్పీ సింధు శర్మ ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు