8, ఫిబ్రవరి 2024, గురువారం

ఆల్ ఇండియా క్యారం పోటీలకు భీమ్గల్ క్రీడాకారులు

 


ఆల్ ఇండియా క్యారం పోటీలకు భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన క్యారం ప్లేయర్స్ డి రవీందర్ గౌడ్ నూతికట్టు సతీష్ లు ఎంపికయ్యారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేసే డి రవీందర్ గౌడ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే నూతికట్ట సతీష్లు ఎంపిక ఇవ్వడంతో భీమ్గల్ పట్టణవాసులు వారిని అభినందిస్తున్నారు జాతీయ క్యారంకు ఎంపికైన ఈ ఇద్దరు ఈ నెల 10 నుండి 15 తేదీల్లో బీహార్ క్యాపిటల్ పాట్నాలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం పోటీల్లో పాల్గొననున్నారు



నూతన కార్యవర్గం ఎన్నిక

 చందూర్ మండల కేంద్రంలో బుధవారం 

చందూర్ మండల   బహుజన టీచర్స్ అసోసియేషన్ 2024 కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా -  యాకూబ్ అలీ అన్సారీ 

మండల ప్రధాన కార్యదర్శిగా -  మేడిపల్లి సాయిలు

 ఎన్నికయ్యారు ఈ ఎన్నిక జిల్లా ప్రధాన కార్యదర్శి డి స్వామి నాయక్ ఆధ్వర్యంలో వీరిని నియమించడం జరిగింది.



మారుతీ మందిర దుకాణం వేలం పాట

 బోధన్ పట్టణంలోని మారుతి మందిర ప్రాంగణంలో గల నెంబర్ ఒకటి దుకాణాన్ని ఈనెల 14వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు ఆసక్తి గలవారు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు అభ్యర్థులు తమ పేర్లను మారుతి ఆలయం వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సంప్రదించాలని తెలిపారు