7, ఫిబ్రవరి 2024, బుధవారం

కిచెన్ టిప్స్ 7-2-2024

 తేనె కొంతకాలం వాడకుండా ఉంచేస్తే సీసా అడుగున గడ్డకట్టుకు పోతుంటుంది అలాంటప్పుడు తేనెను కరిగించడానికి ఓ అరగంట పాటు తేనె సీసాను ఎండలో ఉంచాలి. దీనిని ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో తేనె సీసాను ఉంచాలి నీటి వేడి తో ఐదు పది నిమిషాల్లో తేనె కలుగుతుంది

పాల ప్యాకెట్లు ఫ్రిజ్లో పెట్టుకునేటప్పుడు ఆ ప్యాకెట్లను నేరుగా పెట్టకూడదు ప్యాకెట్ మన వాకిటి ముందుకు వచ్చేలోపు రకరకాల ప్రదేశాలను తాకి ఉంటుంది కాబట్టి ప్యాకెట్ ని నీటితో కడిగి ఫ్రిజ్లో పెట్టడం మంచిది

వెల్లుల్లి రేఖలు పోటు సులువుగా వదలాలంటే వెల్లుల్లి రేఖను కటింగ్ బోర్డు మీద పెట్టి చాకు వెనుకవైపు మందంగా ఉండే వైపు ఈ స్థితిలో చాకు పదును ఉన్న వైపు పైకి ఉంటుంది తిప్పి వెల్లుల్లి రేక చివర గట్టిగా నొక్కితే వెల్లుల్లి రేఖ తేలిగ్గా విడిబడుతుంది

పైనాపిల్ కట్ చేయడానికి పెద్ద చాకులను వాడాలి ముందుగా కలయ పైభాగాన్ని కింది భాగాన్ని తొలగించాలి ఎప్పుడు కాయను నిలువుగా పెట్టి చెక్కును పైనుంచి కిందకు తొలగించాలి ఆ తర్వాత మీడియం సైజ్ చాకుతో కాయను చక్రాలుగా తరగాలి

బటర్ను వంట మొదలుపెట్టడానికి ఓ అరగంట లేదా గంట ముందు ఫ్రిజ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతే వేడి పాల గిన్నెమూత మీద లేదా ఉడుకుతున్న వంట పాత్ర మూత మీద పెడితే పది నిమిషాల్లో మెత్తబడుతుంది అలా కుదరకపోతే స్టవ్ మీద బర్నర్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి

ఐస్ క్రీమ్ సర్వింగ్ స్పూన్లు ఇంట్లో ఉండవు పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దానిని పలుచగా కట్ చేయాలంటే చాకును మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీయాలి ఒక స్లైస్ కట్ చేయగానే చాకు చల్లబడిపోతుంది కాబట్టి ప్రతి స్లైస్ కు ఓసారి వేడి నీటిలో ముంచాలి




యూపీఐతో రైలు టికెట్లు

 రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ లావాదేవీలు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త జనరల్ టికెట్ కొనుగోలు సమయంలో ప్రయాణికులు ఇకపై చిల్లర కోసం జేబులు తడుముకోవాల్సిన పనిలేదు రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ ల వద్ద యూపీఐ లావాదేవీలు చేయవచ్చు రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేసేలా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది యూపీఐ యాప్ లేదా డెబిట్ క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకుంది ఇందుకోసం తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఇప్పటికే 466 పిఓఎస్ కేంద్రాలు యూపీఐ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు దాదాపు అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం అండ్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం కౌంటర్లలో ఇవి అందుబాటులో  ఉన్నాయని తెలిపారు.

డీప్ ఫేక్ టెక్నాలజీతో 207 కోట్లు దోపిడీ

 డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నీరగాళ్లు ఓ మల్టీ నేషనల్ కంపెనీ నుంచి 2007 కోట్ల రూపాయలు కొట్టేశారు ఆ కంపెనీకి చెందిన చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖాన్ని డీప్ ఫేక్ చేశారు ఆపై వీడియో కాల్ చేసి వ సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటూ అకౌంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఆదేశించారు దీంతో సిబ్బంది ఆయన చెప్పిన అకౌంట్లకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు పక్కా ప్లాన్ చేసిన నేరగాళ్లు వారం రోజుల్లో ఈ దోపిడీ ఎపిసోడ్ ను ముగించారు ఆపై తేరుకున్న కంపెనీ సిబ్బంది తమ మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ అతిపెద్ద డీప్ ఫేక్ మోసం కంపెనీకి చెందిన హాంకాంగ్ బ్రాంచ్లో టీవల జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది

వీడియో కాల్ చేసి నమ్మించారు స్కామర్లు పక్కాగా స్కెచ్ వేశారు కంపెనీకి చెందిన మెయిన్ బ్రాంచ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తో పాటు కీలక సిబ్బంది ముక్కాలను డీప్ ఫేక్ చేశారు వాళ్ళ మాట తీరును మక్కికి మక్కి కాపీ కొట్టారు ఆపై క్యాష్ వ్యవహారాలు చూసుకుని హాంగ్కాంగ్ బ్రాంచ్ లోని అకౌంటెంట్ కు వీడియో కాన్ఫరెన్స్ కలిపారు అంతకుముందే సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందని మెయిల్ ద్వారా అతన్ని అలర్ట్ చేశారు గ్రూప్ వీడియో కాల్ లో మాట్లాడుతున్న బాస్ తో సహా మిగతా టీమ్ అంతా తమ కంపెనీ వాళ్ళే కావడంతో అకౌంటెంట్ కు ఏ మాత్రం అనుమానం రాలేదు. వీడియో కాల్ లో వాళ్ళు చెప్పినట్లే ఐదు అకౌంట్లకు 27 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు కంపెనీ హెడ్ ఆఫీస్ కు వెళ్లగా తనను మోసం చేశారని పేర్కొని పోలీసులను ఆశ్రయించారు అయితే ఆ కంపెనీ పేరు ఏంటో కూడా వెల్లడించని పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేకపోయారని మీడియా రిపోర్ట్ తెలిపింది.