3, ఫిబ్రవరి 2024, శనివారం

స్మార్ట్ గౌ.. పల్లె టేకి ఆవిష్కరణ

 


గ్రామీణ ప్రాంత ప్రజల కోసం మొబైల్ యాప్ ఐ ఐఐటి హైదరాబాద్ పూర్వ విద్యార్థి రూపకల్పన

గ్రామీణ ప్రజలకు వీలుగా ఉండేలా స్మార్ట్ గవ్ యాప్అ భివృద్ధి చేశాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ ఐ టి హైదరాబాదులో ఎంటెక్ చేసిన రజనీష్ వాజ్పాయ్ కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిత స్థిరపడ్డారు. మాతృదేశానికి ఏదైనా చేయాలన్న తపనతో గ్రామీణ భారతదేశ ంలో స్మార్ట్ గవర్నెన్స్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కోసం ఆండ్రాయిడ్ యాప్ రూపొందించారు 2017లో రెండు నెలలపై ఇండియాకు వచ్చి తాను పుట్టి పెరిగిన ప్రాంతాల్లో అధ్యయనం చేసి ఆధునిక ప్రపంచంలో గ్రామాలకు ఏం కావాలో తెలుసుకొని ఈ యాప్ ను రూపొందించారని ప్రస్తుతం ఈ యాప్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ఐఐఐటి ప్రతినిది  తెలిపారు.


ఐఐటి మద్రాస్ లో స్పోర్ట్స్ కోట

 దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్ స్పోర్ట్స్ కోట అమలు చేయనుంది 2024 25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది ఇందులో ఒకటి జనరల్ న్యూట్రల్ కు ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ కార్యక్రమం ద్వారా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సూపర్ న్యుమరరి సీట్ల ద్వారా ప్రవేశం కల్పించి ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు



దక్షిణ భారతదేశ వైజ్ఞానిక మేళాలో సత్తా చాటిన జిల్లా ప్రదర్శనలు

 దక్షిణ భారతదేశ వైజ్ఞానిక మేళాలో జిల్లా ప్రదర్శనలు చాటాయి జనవరి 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు విజయవాడలో దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు కామారెడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల చిన్న మల్లారెడ్డి కి చెందిన ప్రవీణ్ కుమార్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు రూపొందించిన లెర్న్ ఫిజికల్ సైన్స్ విత్ ఫన్ అండ్ గేమ్స్ ప్రదర్శన ద్వితీయ స్థానం పొందింది రాష్ట్రం నుంచి 60 వరకు ప్రదర్శించక ప్రవీణ్ కుమార్ కు రెండో స్థానం లభించింది విద్యార్థి వ్యక్తిగత విభాగంలో స్పెషల్ కేటగిరి కింద కొండాపూర్ లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ రావు పర్యవేక్షణలో విద్యార్థి రూపొందించిన ప్రాజెక్టు డ్రైవింగ్ లైసెన్స్ బెస్ట్ ఇగ్నీషియన్ సిస్టం ఉప్పల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థి బబ్లు రూపొందించిన ఇంటలిజెంట్ హెల్మెట్ ఎంపికైంది వారికి వైజ్ఞానిక ప్రదర్శన ప్రతినిధులు సర్టిఫికెట్లను అందజేశారు.