3, ఫిబ్రవరి 2024, శనివారం

ఐఐటి మద్రాస్ లో స్పోర్ట్స్ కోట

 దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్ స్పోర్ట్స్ కోట అమలు చేయనుంది 2024 25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది ఇందులో ఒకటి జనరల్ న్యూట్రల్ కు ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ కార్యక్రమం ద్వారా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సూపర్ న్యుమరరి సీట్ల ద్వారా ప్రవేశం కల్పించి ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు



దక్షిణ భారతదేశ వైజ్ఞానిక మేళాలో సత్తా చాటిన జిల్లా ప్రదర్శనలు

 దక్షిణ భారతదేశ వైజ్ఞానిక మేళాలో జిల్లా ప్రదర్శనలు చాటాయి జనవరి 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు విజయవాడలో దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు కామారెడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల చిన్న మల్లారెడ్డి కి చెందిన ప్రవీణ్ కుమార్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు రూపొందించిన లెర్న్ ఫిజికల్ సైన్స్ విత్ ఫన్ అండ్ గేమ్స్ ప్రదర్శన ద్వితీయ స్థానం పొందింది రాష్ట్రం నుంచి 60 వరకు ప్రదర్శించక ప్రవీణ్ కుమార్ కు రెండో స్థానం లభించింది విద్యార్థి వ్యక్తిగత విభాగంలో స్పెషల్ కేటగిరి కింద కొండాపూర్ లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ రావు పర్యవేక్షణలో విద్యార్థి రూపొందించిన ప్రాజెక్టు డ్రైవింగ్ లైసెన్స్ బెస్ట్ ఇగ్నీషియన్ సిస్టం ఉప్పల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థి బబ్లు రూపొందించిన ఇంటలిజెంట్ హెల్మెట్ ఎంపికైంది వారికి వైజ్ఞానిక ప్రదర్శన ప్రతినిధులు సర్టిఫికెట్లను అందజేశారు.



2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

స్ట్రాన్జా పోటీలకు జిల్లా వాసులు..

 బాక్సింగ్ క్రీడలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్ట్రాంజా బాక్సింగ్ టోర్నమెంట్ కు జిల్లా నుంచి ఇద్దరు ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురువారం బరువుల వారీగా భారత బాక్సింగ్ క్రీడాకారులను ఎంపిక చేశారు జిల్లా స్టార్ క్రీడాకారిణి  నిఖత్ జరీన్ 50 కేజీల బరువు విభాగంలో పోటీ పడనుండగా ఈ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు శిక్షకుడిగా జిల్లా వాసి ఎత్త సాముద్దీన్ వ్యవహరించనున్నారు క్రీడల్లో అతికిష్టమైన బాక్సింగ్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం అయితే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు శిక్షకుడు మన జిల్లా వాసే కావడం మరో ఘనత ఈ నెల ఒకటి నుంచి 12 వరకు బలిగేరియాలోని సోఫియాలో జరిగే 75 వ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ స్ట్రాంజా పోటీలకు భారత జట్టుతో పాటు నిఖ్యారి శిక్షకుడు ఎత్తసముద్దీన్ బయలుదేరారు