2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

మహిళా డిగ్రీ కళాశాలలో స్టేట్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్

 సదాశివ నగర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి మర్కల్ నందు ఈనెల ఐదు ఆరు తేదీలలో స్టేట్ లెవెల్ వైబ్రేషన్ ప్రోగ్రాం కల్చరల్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి రాధిక తెలిపారు గురువారం లేఖర్ల సమావేశంలో కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను వెల్లడించారు రెండు రోజులపాటు నిర్వహించబోయే కల్చరల్ ఫెస్ట్లో 24 కాంపిటీషన్స్ లోని వివిధ రకాల సాంస్కృతిక పోటీలలో ఉండే నియమ నిబంధనల గురించి వివరించారు ఈ రకమైన పోటీల ద్వారా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు అని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీలతోపాటు కామారెడ్డి ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని అన్నారు అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ వీర రాధిక అధ్యాపకులు, విద్యార్థినిలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.




క్రీడా కారిణి ని సన్మానించి న ఐ టీ శాఖా మంత్రి

 తక్కడపల్లి గ్రామానికి చెందిన కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి ప్రతిభా పాటిల్ను రాష్ట్ర  ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కేమ్రాజ్ కళ్యాణి సర్పంచ్ రమేష్ తో కలిసి గురువారం సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాలికలు క్రీడలలో రాణించడం గొప్ప పరిణామమని కొనియాడారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఆటలలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారని వివరించారు క్రీడలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు తనను ఎప్పుడైనా నేరుగా వచ్చి కలవచ్చని తెలిపారు.

అగ్రిషో కిసాన్ 2024

 వ్యవసాయ రంగానికి అగ్రిషోతో మేలు అగ్రిషో కిసాన్ 2024 ను ప్రారంభించిన మంత్రి తుమ్మల.