2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్యకు డాక్టరేట్

 సామాజిక సేవతోపాటు సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ సంస్థ దివ్యాంగుల కోసం స్కూల్ ఏర్పాటు చేసి సామాజిక సేవలు అందిస్తున్న స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్యకు డాక్టరేట్ లభించింది సిద్దయ్య సేవలను గుర్తించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేసింది 1992లో ఏర్పడిన స్నేహ సొసైటీలో సిద్దయ్య 3ఏళ్లుగా సేవలందిస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని సిద్దయ్య పేర్కొన్నారు.



ఆర్మూర్ పద్మశాలి తర్ప సంఘం

 ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆర్మూర్ పద్మశాలి సంఘం నాలుగవ దర్ప అధ్యక్షులు రుద్ర రాజేశ్వర్ ఆరవతర్ప అధ్యక్షులు వేముల ప్రకాష్లను గురువారం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు అంబల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఘనపురం సంతోష్ కుమార్ కోశాధికారి కొక్కుల రవీందర్ సర్వసమాజ ప్రతినిధి చక్రి పద్మశాలి సేవా సమితి అధ్యక్షుడు మేక మోహన్ దాస్ తర్పల అధ్యక్షులు కటకం నరేందర్ సదమాస్తుల గణపతి నూకల నారాయణ బండి అనంతరావు చిట్ల యగ్నేష్ ఆడపు ప్రభాకర్ పాల్గొన్నారు



సాఫ్ట్బాల్ క్రీడాకారినికి సత్కారం

 నేషనల్ లెవెల్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన నవీపేట్ కి చెందిన దీపం స్థానిక దుర్గా యూత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎదుగుదలకు పేదరికం ఎప్పటికీ అడ్డు కాదన్నారు గ్రామీణ నేపథ్యం ఉన్న ఓ బాలిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు దీపం బాలికలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు అనంతరం డాక్టర్ సాధించిన బీడీ దాస్ ను దీప తల్లిదండ్రులను సన్మానించారు కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంతు ప్రవీణ్ తేడు పోశెట్టి సాయిబాబాగౌడ్ లోకం నరసయ్య సూరిబాబు సురేష్ పోసాని దేవరాజ్ దుర్గా యూత్ సభ్యులు గోపి వినోద్ కుమార్ శేఖర్ పాల్గొన్నారు