1, ఫిబ్రవరి 2024, గురువారం

ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షునికి ఘన సన్మానం

 నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘ కార్యవర్గ సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘ కార్యవర్గం ఇటీవల జరిగిన ఆలిండియా ఫెడరేషన్ ఆర్చరీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఈగ సంజీవరెడ్డిని జిల్లా టిఎన్జీవో భవనంలో బుధవారం ఘనంగా సన్మానించారు





రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు కాకతీయ విద్యార్థులు ఎంపిక

 కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి  రగ్బీ  పోటీ ల కు జిల్లా స్థాయి బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి కాకతీయ విద్యార్థులైన సంజన లోకేష్ రెడ్డిలు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించారని వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ తెలిపారు ఎందుకైనా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయ బృందం అభినందించారు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు



నేటి నుంచి పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళ

 హైదరాబాద్ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నారు బుధవారం సంస్థ నిర్వాహకులు మేళా ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 5 వరకు జరగనున్న ఎగ్జిబిషన్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగనున్న పూల మొక్కల ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 160 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మూడు రూపాయల నుంచి 16 లక్షల వరకు విలువగల అరుదైన మొక్కలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలని కోరారు