గురుకుల ప్రతిభ కళాశాలలో 2024 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 4న నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి అలివేలు బుధవారం తెలిపారు జిల్లాలోని ధర్మారం బి కంజర ఆర్మూర్ బి శుద్ధపల్లి పోచంపాడు నవీపేట్ కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి భిక్కనూరు దోమకొండ తాడువాయి తాడుకు కొయ్యగుట్ట తక్కడపల్లి పెద్ద కోడప్పగల్ కామారెడ్డి డిగ్రీ కళాశాల పెద్దయకులారా బాన్సువాడ బోర్లా నిర్మల్ జిల్లాలో ముధోల్ లెఫ్ట్ పోచంపాడు జాం కడెం భయంసాలోని పరీక్ష కేంద్రాలలో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించాలని అన్నారు పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే హాల్ టికెట్లో ముద్రించిన ముఖ్య పర్యవేక్షకుని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందాలని తెలిపారు.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
31, జనవరి 2024, బుధవారం
ఓ టి ఎస్ గడువు మార్చి 31 వరకు పొడగింపు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఏకకాల పరిష్కార పథకం వన్ టైం సెటిల్మెంట్ గడువు మార్చి 31 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సొసైటీ చైర్మన్లు బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల అభ్యర్థుల మేరకు ప్రవేశపెట్టిన ఓ టి ఎస్ పథకం జనవరి 31తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే దీంతో ఈ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు పొడగించి నట్లు పేర్కొన్నారు మార్చి 31 2023 నాటికి కాలపరిమితి ముగిసి బ్యాంకు ద్వారా బట్వాడా చేసిన సొసైటీలో తీసుకున్న రుణాలపై అపరాధ వడ్డీ 100% మాది వాయిదా మీరిన వడ్డీ పైన 30% వడ్డీ మాఫీ చేస్తామన్నారు దీర్ఘ కాలిక జేఎల్సి ఎస్ హెచ్ జి రుణాలపై వాటి 32 శాతం మాఫీ చేయనున్నట్లు తెలిపారు కావున అర్హులైన రుణ గ్రహీతలు ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు మిగతా వివరాల కోసం సంబంధిత సొసైటీలు బ్రాంచ్ మేనేజర్లను సంప్రదించాలని భాస్కర్ రెడ్డి సూచించారు
రగ్బీ పోటీలకుచిన్న మల్లారెడ్డి విద్యార్థుల ఎంపిక
కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లోని శాంతినికేతన్ విద్యాలయ పాఠశాల విద్యార్థులు నలుగురు యాదాద్రి భువనగిరిలో నిర్వహించబోయే రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు పాఠశాల విద్యార్థులు రిషిక దివ్య అభిలాష్ రిషిత గౌడ్లు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి రాజు శివాజీ ఉన్నారు



