2, మార్చి 2024, శనివారం

2000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి

 ఇప్పుడు కూడా 2000 రూపాయల నోట్లు చెల్లుతాయని ఆర్బిఐ ప్రకటించింది 2000 బ్యాంకు నోట్లలో దాదాపు 97.62% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని కేవలం 8470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయని శుక్రవారం తెలిపింది గతమే 19న ఆర్బిఐ రెండు వేల డినామినేషన్ బ్యాంకు నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది అప్పటికి చలామణిలో 356 వేల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి గత నెల 24 నాటికి వీటి విలువ 8470 కోట్లకు తగ్గింది అంటే మే 19 2023 నాటికి చలామణిలో ఉన్న 2000 నోట్లలో 97.62% తిరిగి వచ్చాయి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్.బి.ఐ కార్యాలయాలలో ప్రజలు రెండువేల బ్యాంకు నోట్లో డిపాజిట్ చేయవచ్చు వారి బ్యాంకు ఖాతాలకు క్రెడిట్ కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్బిఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా 2000 బ్యాంకు నోట్లను పంపవచ్చు 200 నోట్లను కలిగి ఉన్నవాళ్లు సంస్థలు వాటిని సెప్టెంబర్ 30 2023 లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది ఆ తర్వాత గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించింది

ప్రొస్టేట్ క్యాన్సర్ గుట్టు విప్పిన ఏఐ

 ఇప్పటికే వివిధ క్యాన్సర్ వ్యాధుల నిర్ధారణ చికిత్సకు ఉపయోగపడే కొత్త విషయాలను గుర్తించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలోనూ డాక్టర్లకు సైతం తెలియని కీలక విషయాన్ని గుర్తించింది. ఇప్పటివరకు ప్రో స్టేట్ క్యాన్సర్ అనేది ఒకే వ్యాధి అని అందరూ అనుకుంటుండగా అది ఒకటి కాదు రెండు రకాలుగా ఉంటుందని ఏఐతేల్చింది ఆక్స్ఫర్డ్ వర్సిటీ మంచిస్టర్ వర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ అంగుళా సైంటిస్టులు కలిసి పాన్ ప్రెస్టేజ్ క్యాన్సర్ గ్రూప్ పేరుతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేశారు స్టడీలో భాగంగా 9 దేశాలలోని 159 మంది ప్రోస్టేట్ క్యాన్సర్ పేషంట్ల నుంచి హ్యూమర్ శాంపిల్స్ సేకరించారు ఈ శాంపిల్స్ లోని డిఎన్ఎలో జరిగిన మార్పులను అధ్యయనం చేశారు అలాగే వీటి జీనోమ్ టెస్టుల డేటాను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కూడా స్టడీ చేశారు దీంతో నిజానికి జన్యుపరంగా ప్రోస్టేట్  క్యాన్సర్ రెండు వేర్వేరు సబ్ టైప్స్ గా ఉందని ఏఐ విశ్లేషించింది ఈ ఫలితాలతో భవిష్యత్తులో ప్రోస్టేట్ క్యాన్సర్ రకాన్ని కచ్చితంగా గుర్తించడంతోపాటు వ్యాధి రకాన్ని బట్టి పేషెంట్లకు బట్టి ప్రత్యేకమైన చికిత్సలు చేసేందుకు వీలవుతుందని రీసర్చ్ చేర్లు తెలిపారు సెల్ జినోమిక్స్ జర్నల్ వీరి అధ్యయనాన్ని ప్రచురించింది

ఎండలో బయటకు వెళ్తున్నారా

 రోజురోజుకు పెరుగుతున్న ఎండలలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు ఆ జాగ్రత్తలు ఇవే

సమయానికి ఆహారం తీసుకోవాలి రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి ఎండలో ఉద్యోగాలకు ఆటలకు వెళ్లే వారైతే మరో లీటర్ అదనంగా తీసుకోవాలి. అంటే చెమట రూపంలో శరీరం శరీరం నుంచి బయటకు పోయే నీటిని తిరిగి శరీరానికి అందించాలన్నమాట దానివల్ల హైడ్రేషన్ సాధారణ స్థాయిలో ఉంటుంది బయటకు వెళ్లేవారు నల్ల కళ్ళద్దాలు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. పదులైన కాటన్ దుస్తులు తరించాలి టైట్ గా ఉండే జీన్స్ పాలిస్టర్ లాంటి దుస్తులకు సాధ్యమైనంత వరకు వేసవిలో దూరంగా ఉంటే మేలు అలాగే చాలామంది ఎండలో నుంచి ఇంటికి రాగానే స్నానం చేయడం లేదంటే చల్లనిల్లతో ముఖం కడుక్కోవడం ఫ్రిజ్లో నుంచి నీళ్లు తీసుకుని తాగడం చేస్తుంటారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి అలా కాకుండా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలో మార్పు వస్తే శరీరం దానిని తట్టుకోలేదు తలనొప్పి జ్వరం గొంతులో మంట లాంటి సమస్యలు వస్తాయి బలహీనంగా సున్నితంగా ఉన్నవారికైతే ఒక్కోసారి ప్రాణానికి ప్రమాదం ఉంచుకోవచ్చు కనుక ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే శరీరం సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకు రెండు మూడు నిమిషాలు విశ్రాంతినివ్వాలి ఆ తర్వాతనే నీళ్లు తాగడం గాని ముఖం కడుక్కోవడం కానీ చేయాలి అదేవిధంగా గంటల తరబడి ఏసీలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లడం కూడా సమస్యలను తెచ్చుకోవడమే క్రమంగా వేసిన తగ్గించుకొని కాసేపు ఏ బాల్కనీలో ఉండి అప్పుడు బయటకు వెళ్లాలి