28, ఫిబ్రవరి 2024, బుధవారం

యాపులు లేని స్మార్ట్ ఫోన్

 స్మార్ట్ ఫోన్లు నానాటికి మరింత స్మార్ట్ గా మారుతున్నాయి వివిధ రకాల అప్లికేషన్స్ యాప్స్ సహాయంతో ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని తమ అరచేతిలోకి తెచ్చిపెడుతున్నాయి అసలు యాప్లతో అవసరమే లేని స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో త్వరలో ఇది కూడా కార్యారూపం దాల్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం స్పెయిన్ లోని బార్సి లోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో జర్మనీ సంస్థ డైయిష్ టెలికం భవిష్యత్తు తరం స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు మొబైల్ యాప్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పై ఆధారపడి పని చేయడం దీని ప్రత్యేకత డైస్ టెలికం తన టీ ఫోన్ డివైస్ పై ఈ కాన్సెప్ట్ ను ప్రదర్శించింది ఎలాంటి యాప్లు లేని యూజర్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉండే ఈ కాన్సెప్ట్ను స్మార్ట్ ఫోన్ చిప్ల తయారీ దిగ్గజం వాల్కమ్ తో కలిసి అభివృద్ధి చేసింది స్మార్ట్ఫోన్లో ఇతర డివైస్లలో యాప్లను వినియోగించడం క్రమంగా తగ్గిపోతుందని రానున్న ఐదు నుంచి పది ఏళ్లలో మనం యాప్ల వినియోగానికి పూర్తిగా స్వస్తి పలుకుతామని తాను గట్టిగా భావిస్తున్నట్లు డైస్ టెలికం కంపెనీ సీఈవో టీం హొట్గేస్ ఈ సందర్భంగా తెలిపారు

గొర్రెకు పాలిచ్చిన ఆవు

 గోమాత ఒక గొర్రె పిల్లకు మాత అయ్యింది తన జాతి భేదాన్ని మరిచి గొర్రె పిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చుతున్నది ఈ అరుదైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది అలంపూర్ నియోజకవర్గంలోని చండూరు గ్రామ శివారులోని ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్న గొర్రె పిల్ల తల్లి ఇటీవల మరణించింది దీంతో ఆ గొర్రెపిల్ల అక్కడే ఉన్న ఆవులమందలోని ఆవు పాలకు అలవాటు పడింది తరచూ ఆకలి తీర్చుకోవడానికి ఆవు చెంతకు చేరి పాలు తాగుతోంది ఆవు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా గొర్రెపిల్లకు పాలిచ్చే కడుపు నింపుతోంది



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

మార్చి 19 తేదీన డాక్ అదాలత్

 తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 19వ తేదీన రాష్ట్రస్థాయి డాక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోస్టల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు మార్చి 8వ తేదీ లోపు పోస్టల్ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పోస్టల్ ప్రధాన కార్యాలయానికి లేఖ అందజేయాలని పేర్కొన్నారు