27, ఫిబ్రవరి 2024, మంగళవారం

జిల్లా కేంద్రంలోని శివాలయాలలో పూజలు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయా శివాలయాలలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రాహ్మణ గల్లి శివాలయం తో పాటు అశోక్ నగర్ విద్యానగర్ కాకతీయ నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలలోని ఆలయాలలో అభిషేకాలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

ఆలయంలో ప్రత్యేక పూజలు

 ఉప్పల్వాయి గ్రామంలోని వనదుర్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామిని రకరకాల పూలతో అలంకరించి అనంతరం పండితుల అభిషేకాలు అర్చనలు చేశారు పండితులు రాజమౌళి శంకర్ గంగాధర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



భానుడి కిరణ కృత్యం సహ్యాద్రి వరుణ విచిత్రం

 ఆస్వాదించాలి కానీ ప్రకృతిలో ఇమిడి ఉన్న అందాలు ఎన్నో కొన్ని సహజసిద్ధంగా అలరిస్తే మరి కొన్ని సమయాలు గుణంగా ఆకర్షిస్తాయి రహదారి నిర్మాణం కోసం తొలిచిన కొండ రెండుగా చీలగా ఉదయం తూర్పు నుంచి ప్రసరించిన సూర్యకిరణాలు పడమర కొండపై పడి ఆ భాగమంతా లేత ఎరుపు రంగులో కనిపిస్తూ ఆకట్టుకుంది తూర్పు భాగం మాత్రం సహజంగా మట్టి రంగులు కనిపించింది ఇలా రెండుగా చీలిన ఒకే కొండ వేరువేరు రంగులలో కనిపించేసరికి ఈ దారి గుండా వెళ్లేవారు అలాగే చూసి ఇది సూర్యకిరణాల మాయ అని తెలుసుకొని ఆశ్చర్య చేతులయ్యారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలాల సరిహద్దులో ఉన్న సహ్యాద్రి పర్వతాల నడుమ సోమవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైనది