బ్యాటరీల సాయంతో పని చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత సేపు పనిచేశాక వేడెక్కడం సర్వసాధారణం. అయితే ఒక్కోసారి ఈ వేడి వల్ల పరికరాలు పేలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది లేదంటే పరికరంలోని ఇతర భాగాలు దెబ్బతింటుంటాయి ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు అదే హైడ్రోజెల్ దీని ద్వారా ఎలక్ట్రానిక్ పరికరం త్వరగా చల్లబడటమే కాక దాని వేడి నుంచే విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు ఈ హైడ్రోజెల్ నీరు, నిర్దిష్ట అయాన్లతో నిండిన పాలియాక్రిల మైండ్ ఫ్రేమ్ వర్క్ తో ఉంటుంది.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
25, ఫిబ్రవరి 2024, ఆదివారం
బ్లడ్ క్యాన్సర్ కట్టడికి కొత్త ఔషధం
ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు కొత్త మందు కనుగొన్నారు రస్ ఫెయిర్ టైడ్ అనే ఔషధం మంచి ఫలితాలను ఇస్తున్నదని ఎర్ర రక్త కణాల అదన ఉత్పత్తిని తగ్గిస్తున్నదని పేర్కొన్నారు అమెరికాలో మౌంట్ సినాయి లోని వికాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నేతృత్వంలో 70 మంది రోగులపై ట్రైల్స్ నిర్వహించారు అనే ఔషధం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుందని దీంతో పాలిసితేమియా వేరా అనే ఒక విధమైన బ్లడ్ క్యాన్సర్ ను నియంత్రిస్తున్నట్లు నిరూపితమైందని పరిశోధకులు చెప్పారు
భాషల అనువాదానికి భాషిని
భారతదేశంలో చాలా మతాలు ప్రాంతాలు ఉన్నాయి ఉపాధి లేదా ఇతర అవసరం నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి మాతృభాష తప్ప వేరే భాష రానివారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దేనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం భాషని పేరుతో కృత్రిమ మేధా ఆధారిత యాప్ను అభివృద్ధి చేసింది ఇది ఒక భారతీయ భాషను మరో భాషలోకి అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషలోకి అనువదిస్తుంది ఈ యాప్ ను ఆండ్రాయిడ్ ఐఓఎస్ వేదికల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు