24, ఫిబ్రవరి 2024, శనివారం

ట్రస్మ నూతన కార్యవర్గం

 



ధర్పల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు తమ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాయి 

నూతన కార్యవర్గంలో

 అధ్యక్షులుగా  - సురేష్ మదన్ శ్రీ మేధా స్కూల్

 జనరల్ సెక్రటరీగా - దత్తాద్రి శారదా విద్యానికేతన్ స్కూల్

 కోశాధికారిగా - మహేందర్ సన్ షైన్ స్కూల్ 

జాయింట్ సెక్రెటరీగా - పోశెట్టి 

మెంబర్లుగా - సాయికృష్ణ, రాజు రెడ్డి, శ్రీకాంత్ ,మాన్సింగ్ ఎన్నికయ్యారు.

 నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ శక్తి మేరకు బాధ్యతలు నిర్వహిస్తామని తెలిపారు

తెలంగాణ రాష్ట్ర డిఎంహెచ్వో ల సంఘం

 తెలంగాణ రాష్ట్ర డిఎంహెచ్వో ల అసోసియేషన్ 2024న ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా పుట్ల శ్రీనివాస్ 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్

 ఉపాధ్యక్షులుగా బల్వన్ కోటాచలం శ్రీదేవి

 కోశాధికారిగా పరిపూర్ణాచారి తో పాటు

 కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు

ఆధ్యాత్మిక సమాచారం 24 ఫిబ్రవరి 2024

 ఘనంగా బోనాల పండుగ బాన్స్వాడ పట్టణంలోని కనకదుర్గ ఆలయ స్థిర విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు పాత బాన్సువాడ నుంచి భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా సంగమేశ్వర కాలనీలోని ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు

శేరి బిబిపేట గ్రామంలోని దాస్ ఆంజనేయ ఆలయ ఐదో వార్షికోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

పిట్లంలో మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ దశమ వార్షికోత్సవాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు అభిషేకాలు గణపతి హోమం ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంగళహారతులు అందుకని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పిట్లం వాసులు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు

బారెడు పోచమ్మ పండుగ బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాలయం బారెడు పోచమ్మ పండుగను గ్రామస్తులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు మహిళలు గ్రామస్తులు మంగళహారతులు బోనాలు కడవలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు పోచమ్మ గుడి చుట్టూ గ్రామస్తులు ప్రదక్షిణాలు చేశారు అనంతరం అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పరిసరాలు కిటకిటలాడే పెద్దలు శివ నందప్ప రాజు సంజు దేశాయ్ మల్లికార్జున్ పటేల్ అశోక పటేల్ పాల్గొన్నారు