23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

పాత రాతి యుగపు పనిముట్లు లభ్యం

 


వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం చిల్లాపూర్ సమీపంలో పాత రాతియుగం నాటి పనిముట్లు లభ్యమయ్యాయి స్థానికంగా ఆరవ తరగతి చదువుతున్న దొబ్బలి శివకుమార్కు ఓ రాతి పనిముట్లు దొరికింది దానిని తమ ఉపాధ్యాయుల సహకారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులకు చూపించాడు ఈ రాతి పనిముట్టు పొడవు 12.5 సెంటీమీటర్లు వెడల్పు 8.5 సెంటీమీటర్లు మందం 3.5 సెంటీమీటర్లు గా ఉంది ఈ రాతి పరికరం ఫోటోలను అంతర్జాతీయ చరిత్రకారుడు రవి కొరిసెంటర్ కర్ణాటక కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజీ హరగోపాల్ తదితరులు పరిశీలించి అది తొలిపాతరాతి యుగం రాతి పని ముట్టు తాటి గుడ్డలుగా నిర్ధారించారు ఈ పనిముట్టు వయసు కనీసం లక్ష సంవత్సరాలకు పైగా ఉంటుందని హరగోపాల్ చెప్పారు.

పిచ్చుకల సంరక్షణకు వినూత్న ప్రయత్నం

 కొన్ని ఏళ్ల క్రితం వరకు ప్రతి ఇంట్లో పిచ్చుకలు కనిపించేవి ఇప్పుడు చెట్ల పైన వాటి జాడలేదు పట్టణీకరణ మొబైల్ టవర్లు వాటి నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పిచ్చుకల ఉనికి ప్రశ్నార్థకమైపోయింది వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో కోతులు పిచ్చుక కూడని ధ్వంసం చేయడం వల్ల కూడా నేర్పించుకలు కనుమరుగవుతున్నాయి ఈ నేపథ్యంలోని కొంతమంది పర్యావరణ వేత్తలు పక్షుల సంరక్షణ బాధ్యత తీసుకున్నారు మిషన్ టు సేవ్ బర్డ్స్ కొత్తగూడెం పేరుతో చుక్కలకు ఆహారం పిచ్చుకలకు ఆహారం సంరక్షణకు ఉచితంగా గూళ్ళు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొత్తగూడెంలోని ఎస్సిసిఎల్ ఉద్యోగి కే రాజశేఖర్ ఈ సేవలో ముందున్నారు ప్రకృతి హరిత దీక్ష అని నవల ఇచ్చిన స్ఫూర్తితో అడుగు ముందుకేసారు ఎండిన వరి కంకులను గూళ్ళను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ పిచ్చుకల సంరక్షణకు దిగారు ఆంధ్రప్రదేశ్లోని తుని పట్టణానికి చెందిన రైతు పర్యావరణవేత్త పి దాలినాయుడు నుంచి తాను ప్రేరణ పొందానని రాజశేఖర్ తెలిపారు సొంత ఖర్చులతో వరి కంకులు పిచ్చుక గూళ్లను కొనుగోలు చేసి స్నేహితులకు ఇరుగుపొరుగు వారికి పంచుతున్నారు ప్రకృతి పరిరక్షణకు తన వంతు సహాయంగా ఈ పని చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు పర్యావరణంలో భాగమైన పక్షులను సంరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యం నుంచి రక్షించుకోగలమని చెప్పారు ఇంటి పరిసరాలలో వరి కంకులు వేలాడదీస్తే పిచ్చుకలు వచ్చే వాలుతాయని చెప్పారు పిచ్చుకలను కాపాడాలని వన్యప్రాణులని నిపుణుల పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనిఅని తెలిపారు.

కిడ్నీ రోగులకు వరంగా పెయిర్డ్ కిడ్నీ డొనేషన్

 


దేశంలోనే సరికొత్తగా రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ రూపకల్పన అదనంగా 40 శాతం మంది రోగులకు ప్రయోజనం వెబ్సైట్ను ఆవిష్కరించిన స్టార్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ గోపీచంద్ మన్యం

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం కుటుంబంలోని దాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం 3 నుంచి 5% మందికి మాత్రమే అందుబాటులో ఉన్న కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలను ఏకంగా 40 శాతం వరకు తీసుకువెళ్లేందుకు కిడ్నీ డొనేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని స్టార్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గోపీచంద్ మన్నెం చెప్పారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని స్టార్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్దాన్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ స్వర్ణలత స్టార్ ఆసుపత్రి నేఫరాలజీ నిభాగాధిపతి డాక్టర్ గంధ శ్రీధర్ తో కలిసి కిడ్నీ స్టాప్ ట్రాన్స్ ప్లాంట్స్ విధానంలో భాగంగా దాతలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ కేడీ విధానం కిడ్నీ రోగులకు వరప్రదాయని అని అభివర్ణించారు భారత్ లో ఏటా సుమారు రెండు లక్షల మందికి కిడ్నీ మార్పిడి అవసరం అవుతుండగా కేవలం ఎనిమిది నుంచి పదివేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి అవకాశం లభిస్తుందని తెలిపారు కుటుంబ సభ్యులు కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడిన బ్లడ్ గ్రూపులు కలపకపోవడంతో మార్పిడి చేయడం సాధ్యం కావడం లేదని చెప్పారు దీంతో ఎన్నో ఏళ్లపాటు డయాలసిస్ మీదనే వారు జీవితాన్ని గడపాల్సి వస్తుందని తెలిపారు దీనికి తోడు మధుమేహం పోషకాల కొరత అతి తక్కువ శానిటేషన్ వంటి కారణాలతో రోగం కాస్త క్రోనిక కిడ్నీ డిసీస్ గా మారుతున్నదని దేశంలో దాదాపు 17 శాతం మందిని సి కె డి వేధిస్తున్నదని వెల్లడించారు గోపీచంద్ తెలిపారు. ఇది తీవ్రతరమై చివరకు అంత్యదశ మూత్రపిండాల వ్యాధి కి దారితీస్తున్నదని అన్నారు కిడ్నీ రోగుల ప్రాణాలను కాపాడేందుకు పేయిర్డ్ కిడ్నీ డొనేషన్ అని అందుబాటులోకి తీసుకువచ్చామని డాక్టర్ గోపీచంద్ తెలిపారు కిడ్నీ పెయిర్డ్ డొనేషన్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ద్వారా ఒకే బ్లడ్ గ్రూప్ కలిగిన వేరువేరు కుటుంబాల్లోని దాతలతో కలుసుకొని తమ వారికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు ఈ విధానం దేశంలో మూత్రపిండాల మార్పిడిలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని గోపీచంద్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా జీవన్ధాని ఇంచార్జి డాక్టర్ స్వర్ణలతో మాట్లాడుతూ అవయవదానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని ప్రస్తుతం అవయవదానంపై ప్రజల్లో కొంత మార్పు వచ్చిందన్నారు స్టార్ ఆసుపత్రిలో ప్రవేశపెట్టిన పీకేడి విధానంతో అందలాదిమందికి కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా రెండు నెలల కిందట టీకేడీ విధానం ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకున్న రఘునాథరెడ్డి మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు