22, ఫిబ్రవరి 2024, గురువారం

ఆలయాలలో ప్రత్యేక పూజలు

 





 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం పండితులు ప్రత్యేక పూజలు చేశారు సుందరీకరణ పనులు భాగంగా రాతి గుమ్మం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు ఆలయ కమిటీ ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అన్నదానం చేశారు అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాత్రి భజన కార్యక్రమం చేపట్టారు ప్రతినిధులు పట్టణం రమేష్ నక్క శ్రీనివాస్ నూకల ఉదయ స్వామి తదితరులు పాల్గొన్నారు

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన దోమకొండలో గోసంగి కాలనీలో బుధవారం నల్ల మారెమ్మ ముత్యాలమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది ఉదయం సర్వదేవత పూజలు హోమాలు యంత్ర సహిత అమ్మవారిల నూతన విగ్రహ ప్రతిష్టాపన కల్యాణోత్సవం నిర్వహించారు కోసంగి సంఘం ప్రతినిధులు నూనెల పుల్లయ్య పోశెట్టి రాజసం రాజేందర్ లక్ష్మీపతి శ్యామ్ పాల్గొన్నారు

బైరాపూర్ రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో బుధవారం భీష్మ ద్వాదశి పూజ నిర్వహించారు భక్తులు అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు బైరాపూర్ కు చెందిన దాతలు గంగారాం సాయి గౌడ్ గ్రామ ప్రజలకు అన్నదానం చేశారు

నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో శ్రీకృష్ణుడు ఆలయ నిర్మాణానికి సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గ్రామస్తులు బుధవారం భూమి పూజ చేశారు ఇందులో సాయిరాం మహేందర్ రమేష్ రామన్న తదితరులు ఉన్నారు

బీర్పూర్ లోని కోదండ రామాలయం ద్వితీయ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు పూజారులు శేషు ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం అలంకరణ తదితర పూజలు నిర్వహించారు అన్నదానం చేశారు ఎంపీపీ రఘు మేకల విట్టల్ గంగారాం సందీప్ లింగం రాజు దుర్గాప్రసాద్ బసవరాజ్ గంగాధర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు

నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయ నూతన కమిటీని గ్రామస్తులు బుధవారం ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా నారాయణ ఉపాధ్యక్షుడిగా అనుసూరి శ్రీనివాస్ కార్యదర్శిగా గుత్తుల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

అయోధ్యలోని రామ మందిరం దర్శనానికి బీర్కూరు మండలంలోని పలువురు భక్తులు బుధవారం తరలి వెళ్లారు తొలత బీర్కూరులోని శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు బరంగేడికి చెందిన లక్కపల్లి రాజు అనే యువకుడు అయోధ్య బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 10 రోజులు సేవ చేసినందుకు భాజపా నాయకులు సన్మానించారు భాజపా జిల్లా కార్యవర్గ సభ్యుడు సాయికిరణ్ శ్రీనివాస్ యోగేశ్వర్ గాలయ్య హనుమాన్లు పాల్గొన్నారు

ఎల్లారెడ్డి కరసేవకుడు నాయిని సాయిరాం విహెచ్పి బజరంగ్దళ్ జిల్లా సహా సంయోజక వినోద్ సభ్యుడు నవీన్ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య రామ మందిర దర్శనానికి బయలుదేరారు వారికి భాజపానేతలు వీడ్కోలు చెప్పారు

మేడారం జాతరలో సరదాగా చూడడానికి ఏమేమి ఉన్నాయి

 అమ్మవార్ల దర్శనం అనంతరం జాతరలో సరదాగా చూడడానికి దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఇవి

రెడ్డిగూడెం సమీపంలో గిరిజన మ్యూజియం ఉంది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతో కూడిన చిత్రాలు వినియోగించిన వస్తువులు చూడొచ్చు సమ్మక్క జీవిత చరిత్రను బొమ్మల్లో తీర్చిదిద్దారు

గిరిజన మ్యూజియం ఆవరణలో ఆంఫి థియేటర్ ఉంది ఆదివాసీ నృత్యాలు నాటకాలు ప్రదర్శిస్తారు అనేక రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి

హరిత హోటల్లో రుచికరమైన వంటలు సిద్ధంగా ఉంటాయి ఇక్కడ వసతి కోసం 24 ఉగాదులు 25 ఆధునిక టెంట్లు ఉన్నాయి ప్రముఖుల బాస కోసం స్విస్ కాటేజీలు గుజరాత్ దర్బార్ గుడారాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి

మేడారం పరిసరాల్లోని సమ్మక్క గుడి గురించి చాలామందికి తెలియదు గద్దెలకు కాస్త దూరంలో పూజారుల నివాసాల మధ్య ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది

సమ్మక్క ను చిలకలగుట్ట పైనుంచి గద్దెలకు తీసుకొస్తారు. ఈ గుట్ట ప్రకృతి రమణీయంగా ఉంటుంది సమీపంలో సమ్మక్క జలపాతం ఉంటుంది గుట్ట చుట్టూ ప్రహరీకి అందమైన బొమ్మలు చూడముచ్చటగా ఉంటాయి..

 అమ్మవార్ల గద్దెలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం కొలువైంది పచ్చని పొలాల మధ్య ప్రకృతి రమణీయతతో అలరాడుతుంది.

పిల్లల్లో చిప్స్ తినే అలవాటు ఎలా మానిపించాలి

 ఇంట్లో పెట్టే ఆహారం అసలు తినకుండా రోజు చిప్స్ తినే పిల్లలు ఆ అలవాటును ఎలా మానిపించాలి. వీటివల్ల ఏమైనా ప్రమాదం ఉందా

పిల్లలు అన్నాక చిప్స్ తింటూ ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు అదే తరచూ తినడం వల్ల అవి వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి చిప్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి బంగాళదుంప అరటి వంటి వాటితో చేసేవి మరొకటి పిండితో బండి ఇవన్నీ నూనెలో ఎక్కువగా వేయిస్తారు. ఇంట్లో చేసినవి అయితే కాస్త పరవాలేదు అదే బయట దొరికే స్నాక్స్ లో రకరకాల మసాలాలు కారప్పొడిలు ఉప్పు వంటివి ఎక్కువగా కలిపి తయారుచేస్తారు నోటికి రుచిగా కరకరలాడుతూ ఎక్కువ సేపు నమిలే శ్రమలేకుండా ఉన్నాయని వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు పిల్లలు ఈ రోజుకి అలవాటు పడటం వల్ల నాలుక వాటిని ఎక్కువగా కోరుకుంటుంది అది తింటే చాలు వాళ్ళ పొట్ట నిండిపోతుంది కాబట్టి వేరే ఆహారం తినాలనిపించదు. చిప్స్లో కెలోరీలు ఎక్కువగా ఉంటాయి శరీర పనితీరుకు అవసరమైన విటమిన్లు ఖనిజాలు వీటి ద్వారా అందవు దాని కారణంగా ఐరన్ జింక్ విటమిన్ ఏ సి లోపాలు తలెత్తుతాయి అంతే కాదు త్వరగా అలసిపోవడం ఏదైనా అనారోగ్యం వస్తే తొందరగా నయం కాకపోవడం చివరకు కంటిచూపులు కోల్పోయే పరిస్థితి కూడా పిల్లలు రావచ్చు కాబట్టి నెమ్మదిగా వారితో మానిపించే ప్రయత్నం చేయాలి. అలా అని వెంటనే చిప్స్ తినొద్దు అంటే వినరు వారం పది రోజులకు ఓసారి ఇస్తూ వాటిని తింటే వచ్చే దుష్ఫలితాల గురించి చెప్పాలి భోజనంలో నూనె పప్పు గింజలు తృణధాన్యాలతో పాటు కూరగాయలు ఆకుకూరలు అన్ని రంగుల పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటయితే క్రమేడా వాళ్లే చిప్స్ అడగడం మానేస్తారు