21, ఫిబ్రవరి 2024, బుధవారం

ఉద్యోగులకు కంపెనీ రాసిచ్చిన మిలియనీర్

 లాభాల కోసం కార్మికులను తొలగిస్తున్న ఈ రోజుల్లో అమెరికాలో ఒక సంస్థ యజమాని తన కంపెనీని కార్మికులకు రాసిచ్చాడు ఆయన పేరు బాబు మూర్.. బాబ్స్ రెడ్ మిల్ పేరిట  ఉన్న ఇతని కంపెనీలో ఇప్పుడు 700 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని యజమాని మిలియనీర్ అయిన మోర్ తన చిరకాల వాంఛను ఈ విధంగా నెరవేర్చుకున్నారు. ఇటీవలే 94 ఏళ్ల వయసులో మోర్ మరణించారు. అమెరికాకు చెందిన మోర్ ఈ సంస్థను 1978లో ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలతో నాణ్యమైన ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసే విక్రయిస్తుంది. సంస్థ ఆనతి కాలంలోనే అభివృద్ధి చెందడానికి ఉద్యోగులే కారణమని మూర్ ఎప్పుడు అభిప్రాయపడేవాడు .అందుకు తన కంపెనీలో వారికి యాజమాన్యం ఇవ్వాలనుకున్నాడు.

26 అడుగుల భారీ అనకొండ

 ఏకంగా 26 అడుగుల పొడవు ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద పామును పరిశోధకులు అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో గుర్తించారు టీవీ వన్యప్రాణి ప్రజంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ ఓంక్ ఈ భారీ అనకొండ ను నీటి అడుగున తిరుగుతుండగా కనిపెట్టారు 200 కిలోల బరువు ఉండే ఈ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద బరువైన పాముగా చెబుతున్నారు



సముద్రం అడుగున వంద రోజులు

 అమెరికా  నావికాదళం మాజీ డైవర్ బయో మెడికల్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ జోడి టూరి నీటి అడుగున వంద రోజులు నివసించి సరికొత్త రికార్డు సృష్టించారు .గతంలో నమోదైన 74 రోజుల రికార్డును చేరిపేసారు .సముద్రపు నీటి అడుగున ఎక్కువ కాలం నివసించవచ్చు అని ఆయన నిరూపించారు. సముద్రంలో 100 రోజుల పాటు నివసించిన అనుభవం తన జీవితాన్ని మార్చిందని ఆయన తెలిపారు. కొత్త విషయాలు తెలుసుకోవడం ,ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు .అన్ని హద్దులను చెరిపేసే విధంగా నూతన తరం పరిశోధకులకు తాను ప్రేరణగా నిలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు.