21, ఫిబ్రవరి 2024, బుధవారం

కోవిడ్ టీకా తో గడ్డ కడుతున్న రక్తం

 వ్యాక్సినేషన్ తర్వాత వివిధ దేశాల్లో భారత్ మినహా టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది కోవిడ్ 19 టీకా దుష్ప్రభావాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక డాటా సేకరించింది దా గ్లోబల్ కోవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో కోవిడి టీకాల పనితీరును మదింపు చేసింది భారత్ మినహా వివిధ దేశాల్లో 9.9 కోట్ల మంది పేషంట్ల నుంచి డాటాని సేకరించి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిసింది ఎంఆర్ఎన్ఏ కోవిడ్ టీకాలు తీసుకున్న వారిలో గుండె సమస్యలు మెదడు రక్తనాళాల్లో గడ్డ కట్టడం వంటివి ఒకటిన్నర రేట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి ఈ తరహా టీకాలే భారత్లోను పెద్ద సంఖ్యలో తీసుకున్నారని దీని ప్రభావం ఏమిటి అన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ జిల్లా వైద్యాధికారుల సంఘం రాష్ట్ర అసోసియేషన్ 2024

 తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జిల్లా వైద్యాధికారుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంగళవారం హైదరాబాద్లోని వెంగళరావు నగర్ లో జిల్లా వైద్యాధికారుల నూతన సంఘం ఆవిష్కృతమైంది వైద్య ఆరోగ్య ప్రమాణాల మేరకు తెలంగాణను దేశంలోని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్న లక్ష్యంతో నూతన జిల్లా వైద్యాధికారుల సంఘం ఏర్పాటయింది ఈ మేరకు జరిగిన ఎన్నికల్లో

అధ్యక్షులు - డాక్టర్ పుట్ల శ్రీనివాస్

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా - డాక్టర్ మల్లికార్జున్

 కోశాధికారిగా - డాక్టర్ పరిపూర్ణాచారి

 సలహాదారులుగా - డాక్టర్ కొండలరావు 

ఉపాధ్యక్షులుగా - డాక్టర్ బల్వన్, డాక్టర్ కోటాచలం, డాక్టర్ శ్రీదేవి

 ఇతర హోదాలో డాక్టర్ సుధాకర్ డాక్టర్ సాంబశివరావు డాక్టర్ కృష్ణ డాక్టర్ శ్రీధర్ నియమితులయ్యారు

మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి ప్రతిష్టాపన

 దోమకొండలోని శ్రీ నల్ల మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవంలో మంగళవారం దోమకొండ జడ్పిటిసి అభివృద్ధి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉదయం అగ్ని ముఖం అగ్ని ప్రతిష్టాపన సర్వదేవత పూజలు హోమములు నూతన విగ్రహాలకు జలాధివాసం శిరాధివాసం దాన్యాధివాసము చతుర్వేద స్వస్తి పూజలు నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఉత్సవాలలో జడ్పిటిసి తో పాటు కాంగ్రెస్ నాయకులు కోసంగి సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మశంకర్ మాజీ ఎంపీటీసీ నల్లపూ శ్రీనివాస్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు సీనియర్ నాయకులు కదిరి గోపాల్ రెడ్డి గోసంక సంఘం నాయకులు నూనె పుల్లయ్య మిర్యాల పోశెట్టి నూనె రాజేశం సింగం నూనె రాజేందర్ లక్ష్మీపతి స్వామి తదితరులు పాల్గొన్నారు