21, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నదాతలుగా కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన కెరడ ప్రవీణ్ అర్చన దంపతులు ముందుకు రావడం జరిగింది అన్నదానానికి ముందుకు వచ్చిన అన్నదాతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో 20050కి పైగా భక్తులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కలికి ఆలయ సేవా సమితి సభ్యులు ఎర్రం చంద్రశేఖర్ కొమిరిశెట్టి దిగంబర్ డాక్టర్ బాలు విజయ్ నరేందర్ రెడ్డి, సిద్ధంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు

ప్లాస్టిక్ రహితమే ప్రాణప్రదం

 పర్యావరణ పరిరక్షణకు మానవ మనుగడకు ప్లాస్టిక్ రహితమే ప్రాణప్రదమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బాసరాజేశ్వర్ వారి తల్లిదండ్రులు భాష పోశెట్టి లక్ష్మీబాయి స్మృతి అర్థం కాటన్ క్లాత్ తో రూపొందించిన హ్యాండ్ బ్యాగులను మంగళవారం జిల్లా కోర్టులోని తన ఛాంబర్ లో సీనియర్ న్యాయవాదులు మంథని రాజేందర్ రెడ్డి ఆకుల రమేష్ నీలకంఠరావు గొర్రెపాటి మాధవరావు శ్రీహరి ఆచార్య కుమార్దాస్ జై వెంకటేశ్వర్ వి భాస్కర్ మాణిక్ రాజ్ ఆశ నారాయణలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు తాగే నీటి నుండి మొదలు తినే ఆహారం వరకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించి బట్టలతో తయారుచేసిన వాటిని ఉపయోగించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వస్తువులు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు మనుషులను చుట్టూ ముడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతకాలపు తరం బట్టలతో చేసిన వాటిని ఉపయోగించి ఆరోగ్యంగా జీవించారని వారే నీటి తరానికి ఆదర్శం కావాలని ఆమె అన్నారు ప్రతి పౌరుడు తన తల్లిదండ్రుల పేరున క్లాత్ తో తయారు చేసిన బ్యాగులను ఇతరత్రా చిన్న చిన్న బ్యాగులను ప్రజలకు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు కారకులు కావాలని ఆమె ఆకాంక్షించారు



22న సెపక్ తక్ర జూనియర్ , సబ్ జూనియర్ క్రీడాకారుల ఎంపికలు

నిజామాబాద్ జిల్లా  సేపక్ తక్ర  సఘం ఆధ్వర్యంలో ఈనెల 22న మోపాల్లోని ప్రెసిడెన్సి పాఠశాలలో ఉదయం 10 గంటలకు జిల్లా బాలబాలికల జూనియర్ సబ్ జూనియర్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా సేపటి తక్రా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కేశవేణు గాదరి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 24 తేదీలలో నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి గవర్నమెంటులో పాల్గొంటారని వారు తెలిపారు. సబ్ జూనియర్ కు క్రీడాకారులు 1  1 2009 తర్వాత జన్మించిన వారు జూనియర్ క్రీడాకారులు ఒకటి ఒకటి 2004 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు ఆసక్తికర క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు వయసు దృవీ కరణ పత్రం తీసుకురావాలని కోరారు ఇతర వివరాలకు జిల్లా సేపాక తగ్గ కార్యనిర్వాహక కార్యదర్శి చామకూర బాగారెడ్డి 8985870006ని సంప్రదించాలని కోరారు