19, ఫిబ్రవరి 2024, సోమవారం

లక్నవరం రూట్ క్లోజ్

 ములుగు జిల్లా లక్నవరం సరస్సు సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పస్రా ఎస్సై షేక్ మస్తాన్ చెప్పారు మేడారం మహా జాతర నేపథ్యంలో వాహనాల రద్దీ భారీ స్థాయిలో పెరిగిందని ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ నెల 19 నుంచి 26 వరకు లక్నవరం రూట్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పారు మేడారం భక్తులు పర్యాటకులు సహకరించాలని కోరారు మేడారం జాతర ముగిసిన అనంతరం తిరిగి లక్నవరం సరస్సు సందర్శన కొనసాగిస్తామని వెల్లడించారు వాహనాలు లక్నవరం సరస్సు వద్దకు వెళ్లకుండా బుస్సాపూర్ క్రాస్ వద్ద బార్కెట్లు ఏర్పాటు చేశారు

ఆర్టీసీ ఖాళీ స్థలాలు లీజుకు

 38.5 9 ఎకరాలకు టెండర్ల ఆహ్వానం

హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆర్టీసీకి చెందిన ఖాళీ జాగాలను లీజుకు ఇచ్చేందుకు అధికారులు ఈ టెండర్లు ఆహ్వానించారు కాచిగూడ మేడ్చల్ షామీర్పేట హకీంపేట చెంగిచెర్ల తుర్కయంజాల్ రషీద్ కూడా శంషాబాద్ ప్రాంతాల్లో మొత్తం 38.5 9 ఎకరాలు లీజుకు ఇవ్వనున్నట్లు టెండర్ లో పేర్కొన్నారు ఆసక్తి ఉన్నవాళ్లు మార్చి 15 వరకు టెండర్ దాఖలకు తుదిగడుగు విధించారు వివరాలకు 9 9 5 9 2 244 3 3 నంబర్లు కానీ లేదా వెబ్సైట్ www.tsrtc.Telangana.gov.in లో కానీ సంప్రదించవచ్చని తెలిపారు

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి లో సభ్యత్వం తీసుకున్న సీఎం రేవంత్ షబ్బీర్ అలీ

 ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి అసోసియేషన్ మాచారెడ్డి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల నుండి కొంతమంది సభ్యులు ఒక సంఘంగా ఏర్పడి మాకు తోచిన విధంగా చిన్న చిన్న సహాయం చేయడం జరుగుతుంది. మేము చేసే మంచి కార్యక్రమాలను చూసి ప్రేరణ పొంది మహమ్మద్ షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ సలహాదారులు తాను సభ్యత్వం తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము చేసే మంచి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా నెలసరి రుసుము 500 రూపాయలతో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి శుభ పరిణామంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ గర్వపడుతున్నాము స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసోసియేషన్ లో భాగమైనందుకు సంతోషిస్తున్నామని ఈ వెల్ఫేర్ ద్వారా మరింత మందికి పేదలకు అనాధ పిల్లలకు చదువుకునే పిల్లలకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు