19, ఫిబ్రవరి 2024, సోమవారం

గృహిణి సేవలకు వెలకట్టలేము

 ఆమె సేవలను డబ్బు కోణంలో చూడరాదు ఇంట్లో సంపాదించే వ్యక్తి కంటే ఆమె ఏం తక్కువ కాదు ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఇంటి పనులు కూడా ఓ లెక్క అని గృహనులను తీసిపారేసే వారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు చెప్పింది ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని ఆ మాటకొస్తే ఆమె సేవలు అమూల్యమైనవని పేర్కొంది ఓ యాక్సిడెంట్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది కేసు పూర్వాపరోలోకి వెళ్తే 2006లో ఓ మహిళ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి భీమా లేకపోవడంతో ఆమెకు పరిహారం చెల్లించే బాధ్యత వాహన యజమాని పై పడింది మృతురాలి భర్త ఆమె మైనర్ కుమారుడికి రెండున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది అయితే ఆ మొత్తం సరిపోదంటూ బాధ్యత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది కేసును విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది ఆమె గృహిణి కాబట్టి పరిహారం పిక్స్డ్ గా ఉంటుందని కనీస ఆదాయాన్ని పరికండనలోకి తీసుకొని పరిహారం చెల్లించడం సభబేని స్పష్టం చేసింది హైకోర్టు తీర్పును బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తాజాగా ఈ కేసును విచారించిన జస్టి సూర్యకాంత్ జస్టిస్ కె వి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పును తప్పు పట్టింది గృహిణి ఆదాయాన్ని రోజు కూలి కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింద హైకోర్టు వ్యాఖ్యలను తాము అంగీకరించబోమని గృహిణి సేవలకు విలువ కట్టలేమని పేర్కొంది ఆరు వారాల్లోగా 6:30 లక్షల పరిహారం చెల్లించాలని వాహన యజమానిని ఆదేశించింది ఇంట్లో సంపాదించే వ్యక్తి పాత్ర ఎంతో ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి పనులు చక్కబెట్టి గృహిణి పాత్ర కూడా అంతేనని ఆమె విలువను తక్కువగా అంచనా వేయొద్దని సూచించింద

వధువు కావలెను అంటూ రిక్షా పై హోర్డింగ్

 


మా అమ్మ నాన్నలు పూజలు పునస్కారాలతో బిజీగా ఉంటారు నాకేమో పెళ్లిడు దాటిపోతుంది సమాజంలో అమ్మాయిలు తగ్గిపోయారు. మొదట్లో మ్యారేజ్ గ్రూపును సంప్రదించిన లాభం లేకపోయింది దీంతో తల్లిదండ్రుల అనుమతితోనే ఇలా తిరుగుతున్న అంటాడు మధ్యప్రదేశ్ లోని దమోహ్ నగరవాసి దీపేంద్ర రాథోడ్. ఈ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న ఈ యువకుడు అదే వాహనానికి పెళ్లి కుమార్తె కావాలని అంటూ హోర్డింగు కట్టుకొని నగరమంతా తిరుగుతున్నాడు ఆ హోర్డింగ్ పై దీపేంద్ర ఫోటోతో పాటు ఎత్తు పుట్టిన తేదీ బ్లడ్ గ్రూపు విద్యార్హతలు గోత్రం వంటి వివరాలన్నీ ఉన్నాయి కులం మతం వంటి పట్టింపులు లేవు స్థానికేతరులైన పర్వాలేదట ఈ రిక్షా సాయంతో కుటుంబాన్ని పోషిస్తున్న దీపేంద్ర తన జీవిత భాగస్వామి ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూస్తానని అంటున్నాడు.


మధ్యప్రదేశ్ లోని దామోహు  లో ఓ 29 ఏళ్ల యువకుడు తనకు వధువు కావాలని కోరుతూ తన ఈ రిక్షాకు ఇలా హోల్డింగ్ తగిలించాడు తన ఎత్తు పుట్టిన తేదీ గోత్రం వంటి వివరాలు పేర్కొంటూ కుల మతాలకు అతీతం అని కూడా ప్రకటించుకున్నాడు ప్రస్తుతం వధువు దొరకడం కష్టంగా మారిందని దీంతో ఇలా హోర్డింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్పాడు

బుందేల్ఖండ్లో నీటి ఎద్దడికి ఇక్రిశాట్ చెక్

 


ఉత్తరప్రదేశ్లో తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతున్న బుందేల్ఖండ్ ప్రాంతం ఈక్రిశాట్ చొరవతో అనతి కాలంలోనే ఆ సమస్య నుంచి గట్టెక్కింది. అక్కడి ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన తీవ్రంగా ఉన్న లలిత్పూర్ సింగర్ సుట్ట గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది ఆయా గ్రామస్తుల భాగస్వామ్యంతో తొలుత సహజ వనరుల నిర్వహణ గ్రౌండ్ వాటర్ రీచార్జింగులపై దృష్టి సారించింది హైడ్రాలజిస్టులతో కలిసి వాటర్ ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్ విధానాలను అమలు చేసింది ఆయా గ్రామాల్లో 78 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ను ఏర్పాటు చేయించడంతోపాటు పంట పొలాల్లో బోర్ వెల్స్ ను రీఛార్జ్ చేసేందుకు ప్రధాని ఇచ్చింది ఈ చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కేవలం మూడేళ్లలోనే రెండు నుంచి పది మీటర్ల మేరకు వృద్ధి చెందడంతో పాటు పంట దిగుబడులు 20 నుంచి 80% మేరకు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు