15, ఫిబ్రవరి 2024, గురువారం

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు శిక్షణ తరగతులు

 రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించనుంది ఈ మేరకు రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది 45 రోజులపాటు కొనసాగే ఈ శిక్షణ తరగతుల్లో 12 కేంద్రాల ద్వారా 450 మంది అభ్యర్థులను వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వనుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా గురువారం నుంచి హజ్ హౌస్ కార్యాలయంలోని ఆరవంతస్తులు ఈ నెల 16వ తేదీ లోపు సమర్పించాలని సూచించింది విద్యార్థులు విద్యార్హతలు 10 ఇంటర్మీడియట్ డిగ్రీ గల అభ్యర్థులు అర్హులని వారి వయస్సు 18 నుంచి 44 మధ్య ఉండాలని ఆ శాఖ ఎండి ఓ ప్రకటనలో తెలిపారు



ఒబేసిటీకి కారణం ప్యాకేజ్డు ఫుడ్డే..

 ప్యాకేజ్డ్ ఫుడ్ శరీరంలో కొవ్వును పెంచుతుందని పట్టణవాసుల్లో ఒబేసిటీ స్థూలకాయం సమస్యలు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని జాతీయ పోషకాహార సంస్థ తేల్చింది రోజుకు సగటున్న దాదాపు 100 గ్రాముల ప్యాకేజ్డ్ ఫుడ్ మన ఆహారంలో భాగంగా మారుతున్నట్టు గుర్తించింది అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వ్యాయామం చేయకపోవడం వల్ల చాలామంది అధిక బరువు స్థూలకాయ లాంటి సమస్యల బారిన పడుతున్నట్టు ఎన్ఐఎన్ పరిశోధకులు తమ అధ్యయన పత్రంలో స్పష్టం చేశారు చాక్లెట్లు అధిక చక్కెర కలిగిన ఆహార పదార్థాలు బేవరేజెస్ స్వీట్ బిస్కెట్ల లాంటి 100 గ్రాముల ప్యాకేజీ ఫుడ్ తో ఏకంగా 500 కేలరీల శక్తి లభిస్తుందని ఈ లెక్కన నెలలో మనం కనీసం కిలో బరువు పెరుగుతామని వివరించారు దీనివల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డయాబెటిస్ హైపర్ టెన్షన్ హార్ట్ ఎటాక్ స్ట్రోక్స్ లాంటి సమస్యలు అధికమవుతాయని హెచ్చరించారు అంతర్జాతీయ సగటుతో పోల్చితే మన దేశంలో అర్థాయుష్షుతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని ప్రతి ముగ్గురిలో ఒకరు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు

ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం దోమకొండ

 ఐవిఎఫ్ ఆక్సిస్ ఫెర్టిలిటీ క్లినిక్

 ఇంటి నెంబరు 13 55 ఏ 

మొదటి అంతస్తు 

హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన

 రోడ్ నెంబర్ 1 మరియు 45

 జూబిలీ హల్స్ 

హైదరాబాద్ తెలంగాణ 33 

వారి ఆధ్వర్యంలో

ఎస్ దేవేందర్ రావు హాస్పిటల్ దోమకొండలో తేదీ 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం నాడు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు

కాల్ ఆర్ వాట్సప్ నరేష్ 9 9 0 0 9 4 3 9 1 8 ముందస్తు బుకింగ్ చేసుకోవడానికి

భార్యాభర్తలు తప్పనిసరిగా హాజరుకావాల మరియు వారి యొక్క పాత రిపోర్టులు మరియు ప్రభుత్వ గుర్తింపు ఐడి కార్డులు తీసుకొని రాగలరు 

Ivf  పేషెంట్లకు ఉచిత వసతి కలదు.  ఫర్టిలిటీ స్పెషలిస్టులు డాక్టర్ విజయ మాధురి సురసాని డాక్టర్ ఆదముల్లా శృతి డాక్టర్ ఫాతిమా రఫీ