పుస్తకప్రియలకు పండగే పండగ 200కు పైగా ఇంగ్లీషు 110 కి పైగా తెలుగు 30కి పైగా హిందీ తదితర భాషలతో 360కు పైగా స్టాళ్లతో కూడిన హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభం కానుంది పది రోజులపాటు అంటే 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు శని ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు మిగతా రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు ఈ మేరకు బుక్ ఫైర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ వెల్లడించారు ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుతీరిన గద్దర్ స్మారక పుస్తక ప్రదర్శన ప్రాంగణాన్ని శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు అమరవీరుల స్మారకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్న 12 అడుగుల స్థూపాన్ని తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు ఫిబ్రవరి 10 18 వరకు రోజు మధ్యాహ్నం బాలవికాస్ పేరుతో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ వివరించారు వారం పాటు రోజు సాయంత్రం సాహిత్య చర్చ పోస్టులు రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉన్నట్లు తెలిపారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
9, ఫిబ్రవరి 2024, శుక్రవారం
భారత్ పప్పు కిలో 60 రూపాయలు
మిర్యాలగూడ కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరిట కిలో శనగపప్పును 60 రూపాయలకే ప్రజలకు అందిస్తోంది నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విక్రయాలు ప్రారంభమయ్యాయి మూడు నెలల క్రితమే భారత్ శనగపప్పు కేజీ ప్యాకెట్లను ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టారు అమెజాన్ రిలయన్స్ సంస్థల్లో భారత్ జనాధాళ్ ను 60 రూపాయలకు కేంద్రం విక్రయిస్తోంది బహిరంగ మార్కెట్లో దాని విలువ 75 నుంచి 80 రూపాయలుగా ఉంది ఈ క్రమంలో మిర్యాలగూడలో ప్రధాన వీధుల్లో ఆటోలు ప్రధాన వీధుల్లో భారత్ పప్పు విక్రయాలు ప్రారంభమయ్యాయి ఆన్లైన్ విక్రయాల గురించి తెలియని వారు ఆటోల వద్ద పాపం కొనుగోలు చేస్తున్నారు ఇటీవల కేజీ 29 రూపాయలకే భారత్ రైస్ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసింది హాకా ద్వారా డీలర్లు వీటిని కొనుగోలు చేసి విక్రయించుకునే అవకాశం ఉంది
వాట్సాప్ లో థర్డ్ పార్టీ చాట్
ఇతర మెసేజ్ యాప్ యూజర్లకు సందేశాలు పంపే.. అవకాశం.. టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్ ఇతర యాప్ యూజర్లకు సందేశాన్ని పంపేందుకు థర్డ్ పార్టీ చాట్ సెక్షన్ తీసుకొస్తున్నామని వాట్స్అప్ మాతృ సంస్థ మెటా తాజాగా వెల్లడించింది వాట్సాప్ ఖాతాదారులు తమ సందేశాల్ని ఇతర యాప్ లోని యూజర్లకు పంపేందుకు క్రాస్ ప్లాట్ఫా మెసేజింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది తొలత దీనిని ఈ నిబంధనల ప్రకారం యూరప్ దేశాల్లో తీసుకొస్తారని సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కొత్త కాన్సెప్ట్ పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని వాట్సాప్ ఇంజనీర్ బ్రౌజర్ ఇంటర్వ్యూలో చెప్పారు అయితే టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్ గూగుల్ ఐ మెసేజ్ ఆపిల్ మొదలైనవి వాట్సాప్ తో చేతులు కట్టాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది యూజర్ల ప్రైవసీ భద్రత నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్ పై కంపెనీల మధ్య పలు ఒప్పందాలు కుదరాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు