పాల్వంచ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ పరికరాలను మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పాలబోయిన సత్యం మాట్లాడారు గురు విద్యాసంస్థల చైర్మన్ గురువేందర్ రెడ్డి సహకారంతో 25వేల రూపాయల విలువైన సైన్స్ ల్యాబ్ పరికరాలను పాఠశాలకు అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కాశీనాథం కాశీనాథ్ రావు గంగారెడ్డి కృష్ణమూర్తి లక్ష్మీపతి దాత గురువేందర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ జితేందర్ రెడ్డి కూచని శేఖర్ తదితరులు పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
31, జనవరి 2024, బుధవారం
న్యాయ పాలనలో శిక్షణ
న్యాయ పాలన అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ లో 2023 24 సంవత్సరంలో శిక్షణ పొందడానికి జిల్లాలోని అర్హులైన బీసీ న్యాయ శాస్త్ర పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షలు మున్సిపల్ లో ఉన్నవారికి మించకూడదని అన్నారు శిక్షణ కాలంలో మూడు సంవత్సరాల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున సబ్సిడీ రూపేనా ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు మొదటి సంవత్సరంలో పుస్తకాలు ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం 3000 రూపాయలు మంజూరు చేస్తారని తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం కామారెడ్డిలో ఈ నెల 31వ తేదీ వరకు స్వయంగా అందించాలని సూచించారు
30, జనవరి 2024, మంగళవారం
ఉచిత నేత్ర వైద్య శిబిరం
లైన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక క్లబ్ కార్యాలయంలో ఉచిత నేత్రవైద్య శిబిరం ఏర్పాటు చేశారు 30 మందికి కంటి పరీక్షలు చేయగా నలుగురికి దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధారించామని వైద్యుడు సతీష్ తెలిపారు క్లబ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ విటల్ గాలయ్య కిషోర్ సంతోష్ హనుమాన్లు సూర్యప్రకాష్ ఉన్నారు

