30, జనవరి 2024, మంగళవారం

ముగిసిన వాలి బాల్ పోటీలు

 జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ట్రస్ట్ ఓపెన్ వాలీబాల్ పోటీలు సోమవారం ముగిశాయి ఈ సందర్భంగా బాగా రెడ్డి తనయుడు రాష్ట్ర భాజపా నాయకుడు జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి స్థానంలో గెలుపొందిన తాడ్వాయి జట్టుకు 30 వేల రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన గుడి వెనక తండా జట్టుకు 20వేల రూపాయలు తృతీయ స్థానం కైవసం చేసుకున్న మోతె జట్టుకు పదివేల రూపాయల నగదు బహుమతులను అందజేశారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక నగదు బహుమతులు ఇచ్చారు ఈ పోటీలో మొత్తం 40 జట్లు తలపడ్డాయి భాజపా నాయకులు యువజన నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.




జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

బీర్కూర్ బిసి గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న సర్దార్ అనే విద్యార్థి జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మాధవి ఏటీపీ జ్యోతి పి ఈ టి అమీర్ సోమవారం తెలిపారు ఇటీవల నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు చెప్పారు.
మూడున సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్
కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిబ్రవరి మూడవ తేదీన 9వ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు అండర్ 8,10 ,12,14సంవత్సరాల బాలబాలికలకు వేరువేరుగా పోటీల నిర్వహణ ఉంటుందని తెలిపారు

ఉమ్మడి జిల్లా అండర్ 17 బాల బాలికల విభాగాల్లో వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు ఈనెల 30న ఉదయం పదిగంటలకు నిజామాబాద్ డిఎస్ఏ ఈత కొలనులోని హాలులో నిర్వహిస్తామని ఎస్ జి ఎఫ్ కార్యదర్శి సంగీత్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు బాలురకు 50 56 62 69 77 85 94 94 ఆపై కిలోల విభాగాల్లో బాలికలకు 44 48 53 58 63 69 69 ఆపై కిలోల విభాగాల్లో ఎంపికలు ఉంటాయని తెలిపారు.



 

దోమకొండలో సంకష్టహర చతుర్థి పూజలు

 దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో సోమవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వినాయకుడికి పూలతో అందంగా అలంకరించారు అనంతరం భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం శావతీశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తో పాటు పూజారి శరత్చంద్ర భక్తులు పాల్గొన్నారు