10, ఫిబ్రవరి 2026, మంగళవారం

శివరాత్రి మహోత్సవాలు ,దోమకొండ 2026

 



శ్రీ శివరామ మందిరము ,గ్రామము మరియు మండలము దోమకొండ,

 కామారెడ్డి జిల్లా, 

శివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ రథోత్సవ సమాహ్వా న పత్రిక .



శివరాత్రి బ్రహ్మోత్సవాలు 

స్వస్తిశ్రీ విశ్వవస్తునామ సంవత్సర మాఘ బహుళదశమి తేదీ 12 ఫిబ్రవరి 2026 గురువారం నుండి  మాఘ బహుళ అమావాస్య తేదీ 16 ఫిబ్రవరి 2026 సోమవారం వరకు

 శ్రీ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళణోత్సవము మరియు రథోత్సవ పంచాహ్నిక కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగును.

ముఖ్య అతిథులు ..గౌరవనీయులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, శాసనసభ్యులు, కామారెడ్డి నియోజకవర్గం.

 గౌరవ అతిథులు.. గౌరవనీయులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారు ,రాష్ట్ర ఎస్టీ ,ఎస్సీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులు.

 అతిథులు ..గౌరవనీయులు శ్రీ సురేష్ షెట్కర్ గారు, పార్లమెంటు సభ్యులు ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, 

 శ్రీ ఐరేని నరసయ్య గారు ,సర్పంచ్ దోమకొండ.

 శ్రీ బొమ్మెర శ్రీనివాస్ గారు ,ఉప సర్పంచ్ దోమకొండ.

 శ్రీ కదిరే గోపాల్ రెడ్డి గారు, ఏఎంసీ డైరెక్టర్.

 సర్వ శ్రీ వార్డు సభ్యులు, జిపి దోమకొండ.

 ధర్మకర్తలు..

 నగరం నరసింహులు, నాయిని లింగారెడ్డి, చింతల చిరంజీవి, చెన్నం స్వాతి శేఖర్.

 దేవాలయ మాజీ చైర్మన్ లు.. 

శ్రీ కర్రోల్ల భీమా గౌడ్, శ్రీ చెన్నం లక్ష్మీకాంతం, శ్రీ తోట శేఖరయ్య, శ్రీ అబ్రబోయిన యాదగిరి ,శ్రీ ఐరేని నరసయ్య, శ్రీమతి దీకొండ శారద ,శ్రీ పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, అబ్రబోయిన రాజేందర్.

 భక్తులు మరియు గ్రామ ప్రజలు. దోమకొండ

 శ్రీ కొండ అంజయ్య, చైర్మన్.



 కార్యక్రమ వివరాలు ..

12-2-2026 గురువారం రోజున..

 ఉదయము 10 గంటల 15 నిమిషాల నుండి ప్రదోష పూజ, గణపతి పూజ ,పుణ్యహవచనము, అఖండ దీపారాధన, రుత్విక్ వరణము, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగము, శేష సాయిపై స్వామివారి ఊరేగింపు.

 13 -2-2026 శుక్రవారం రోజున ..

ఉదయం నుండి ప్రాతఃకాల పూజ , మాతృకా యోగిని, వాస్తు ,క్షేత్రపాలక ,నవగ్రహ మండల స్థాపనలు, అగ్ని ప్రతిష్ట, స్థాపిత దేవత హవనములు, రుద్రహవనము, ధ్వ జారోహణము , భేరీ పూజ, బలిహరణ ,సాయంత్రం నంది వాహన ఊరేగింపు .

14వ తేదీ శనివారం రోజున..

 స్థాపిత దేవతాహనము, పూజలు, రుద్రహవనము,శేషసాయిపై స్వామివారి ఊరేగింపు.

 15వ తేదీ ఆదివారం రోజున..

 ప్రాతఃకాల పూజ ,భక్తుల అభిషేకములు, ఎదుర్కొల్లు, గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము.



అశ్వవాహనముప  స్వామివారి ఊరేగింపు.

 రాత్రి ఒంటిగంట పది నిమిషాలకు నిశి పూజ, దిష్టికుంభాలు ,స్వామివారి రథారోహణ గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ,శ్రీ సీతారామచంద్ర స్వామివార్లు రథములపై స్థానిక ప్రయాణ ప్రాంగణం వద్దకు బయలుదేరుట .తదనంతరము లంకా దహనం అనంతరం రథములు ఆలయం ప్రవేశించుట .

తేదీ 16 ఫిబ్రవరి సోమవారం రోజున..

 ఉదయం నుండి చక్రతీర్థం, నాకబలి, ఆవబృద స్నానం, పూర్ణాహుతి మొదలవు కార్యక్రమాలు జరుగును. కావున భక్తాగ్రేసరులు పై కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.



 శ్రీ బావి కృష్ణమూర్తి శర్మ ,యాగ్నికులు.. శ్రీ జనమంచి రామకృష్ణ శర్మ, ఆలయ పూజారి. శ్రీ జన మంచి వసంత్ శర్మ ,రుత్వికులు. శ్రీ భావి శరత్చంద్ర శర్మ, రుత్వికులు.

 శ్రీ వి విజయరామరావు, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ.

 శ్రీ కొండ అంజయ్య ,దేవాలయ కమిటీ చైర్మన్ 9701 744 251 

శ్రీ బూర్ల ప్రభు, కార్యనిర్వాహణాధికారి.

5, ఫిబ్రవరి 2026, గురువారం

కాస్మెటిక్స్ తో క్యాన్సర్ ఎలా వస్తుంది

 



ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి . ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరు లక్షలకు పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ,గర్భాశయ ,అండాశయా క్యాన్సర్లు అత్యంత ప్రబలంగా కనిపిస్తున్నాయి .చర్మ క్యాన్సర్లు కూడా ఆడవాళ్లను పట్టిపీడిస్తున్నాయి .అయితే మహిళలు ఉపయోగించే అనేక సౌందర్య ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

 అమెరికా లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ సర్వేలో భాగంగా అమెరికాకు చెందిన 64 మంది మహిళలను ఎంచుకున్నారు. వారు నిత్యం ఉపయోగించే సబ్బులు, లోషన్లు ,షాంపు, కండిషనర్ ,స్కిన్ లైట్నర్, ఐ లైనర్,  ఐలాష్ గ్లూ లాంటి దాదాపు 1143 ఉత్పత్తులను పరిశీలించారు .అందులో 53 శాతం మంది ఫార్మాలిడిహైడ లాంటి క్యాన్సర్ కారకాలను విడుదల చేసే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించినట్టు కనుగొన్నారు. అనేక ఉత్పత్తుల్లో ఫార్మాలిడిహైడ్ను  విరివిగా వాడుతున్నారని, ఇది క్యాన్సర్ కారకమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి విడుదలయ్యే వాయువులు క్యాన్సర్ను కలగజేయడమే కాకుండా శరీరంపై దద్దుర్లు ,జుట్టు,  గోర్లపైన ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వీటిని అలాగే వాడితే దీర్ఘకాలంలో రొమ్ము క్యాన్సర్ తో పాటు గర్భాశయ, అండాశయం క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు .


యూరోపియన్ యూనియన్ 2009లోనే ఫార్మాలిడిహెడ్ ను కాస్మెటిక్ పదార్థంగా నిషేధించిందని పలువురు గుర్తు చేశారు. అయినా అనేక సౌందర్య ఉత్పత్తుల సంస్థలు ఇష్టారాజ్యంగా వీటిని వాడుతున్నాయని చెబుతున్నారు. అయితే ఆయా ఉత్పత్తుల లేబుల్స్ పై ఫార్మల్ డిహైడ్ గురించిన వివరాలు ప్రత్యక్షంగా ఇవ్వడం లేదని చాలా వరకు దాని రసాయనిక పేర్లను వాడుతున్నారని తెలిపారు. 


కాబట్టి వినియోగదారులు సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో లేబుల్స్ను క్షుణ్ణంగా చదవాలని సూచిస్తున్నారు .ఏ రకమైన ఉత్పత్తులు అనారోగ్యానికి గురిచేస్తాయో తెలుసుకోవడానికి రసాయన శాస్త్రవేత్తలే కావాల్సిన అవసరం లేదని ,కాస్త అవగాహన ఉంటే చాలని అంటున్నారు. అందంగా ఉండాలని ఆరాటపడుతూ లేనిపోని కొత్త రోగాలు కొని తెచ్చుకోకూడదని సలహాయిస్తున్నారు.

4, ఫిబ్రవరి 2026, బుధవారం

మోకాలి నొప్పికి ముక్కు సహాయం

 మోకాలి నొప్పులు తగ్గడానికి ముక్కు తోడు పడుతుందా? మోకాలికి ,ముక్కుకు ముడి పెట్టడం ఏమిటి? అని పెదవి విరవకండి .యూనివర్సిటీ ఆఫ్ బెసల్ పరిశోధకులు నిజంగా అలాంటి ఘనతనే సాధించారు. ముక్కు దూలం కణాలతో మృదులాస్తిని వృద్ధిచేసి కీళ్లలో అమర్చే విధానాన్ని రూపొందించారు . కీళ్లు వరుసుకుపోకుండా   చూసే మృదురాస్తి మిగతా కణజాలాల వలె దానంతట అదే కుదురుకోదు .అందుకే దీర్ఘకాలం మోకాలి నొప్పులు బాధపెడుతుంటాయి .వీటి నుంచి బయటపడటానికి బేసిల్ యూనివర్సిటీ చేసిన కొత్త ప్రయత్నం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇందులో రోగి ముక్కులోని మృదులాస్తి నుంచి కొంత నమూనాన్ని తీస్తారు. దీని కణాలను ప్రయోగశాలలో వృద్ధిచేసి మృదువైన పీచుతో కూడిన  చట్రం లో కూర్చుతా రు. అప్పుడు అవి కొత్త  మృదులాస్తి కణజాలంగా వృద్ధి చెందుతాయి .ఇది అవసరమైనంత సైజు ఆకారానికి చేరుకున్నాక దెబ్బతిన్న మోకాలి కీళ్లలో అమరుస్తారు.

పర్ఫెక్ట్ క్యాటరింగ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కామారెడ్డి

 పర్ఫెక్ట్ క్యాటరింగ్ సర్వీసెస్, 

హౌసింగ్ బోర్డ్ కాలనీ,

 కామారెడ్డి..


అన్ని రకాల పండుగలకు ,ఫంక్షన్లకు ,పెళ్లిళ్లకు రుచికరమైన ఆహారం సప్లై చేయబడును.

100 నుండి 5వేల మంది వరకు సభ్యులు పాల్గొని కార్యక్రమాలకు కూడా మేము సప్లై చేయగలము.

కాంటాక్ట్..9666287828,9346877277




వ్యాపారుల కోసం బిల్డ్..బోయింగ్ ఆఫర్..

 అప్లికేషన్లు కోరిన బోయింగ్..

 విమానాల తయారీ సంస్థ  బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ /బిల్డ్  ప్రోగ్రాం 5 ఎడిషన్ కొరకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

భారత విద్యార్థులు మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. 

2019లో ప్రారంభమైన బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు , స్టార్ట్ అప్ లు ప్రయోజనం పొందాయి.. 

అర్హత..

ఏరో స్పేస్ ,టెక్నాలజీ, డిఫెన్స్ ,సస్టెనేబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాలలో వినూత్న ఆలోచన లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 

ప్రయోజనం ఏమిటి?

ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు .విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి పది లక్షల రూపాయల గ్రాంట్ అందజేస్తారని బోయింగ్ తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరింది.

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

అత్యంత ఖరీదైన నం.ప్లేట్ DDC0001

 దేశంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ గా గుర్తింపు.

బి బి టి వేలంలో తగ్గించుకున్న గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంతైనా వెచ్చించడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ క చెందిన వ్యక్తి ఫ్యాన్సీ నెంబర్ కొరకు వేలంలో రెండు కోట్ల ఎనిమిది లక్షలు  బిడ్ వేసి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు.

లగ్జరీ ప్రముఖులు వాడిన వస్తువులు వాహనాలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించే బిగ్ బాయ్స్ టాయిడ్ యాప్..DDC 0001 అనే ఫ్యాన్సీ కార్  నంబర్ ను వేలం వేస్తే, గుంటూరు కు చెందిన కిరణ్ కోల్పాకుల అనే వ్యక్తి రూ 2.08 కోట్లకు బిడ్ వేసి దానిని చేజిక్కించుకున్నారు. తన మారుతి సుజుకి ఇగ్నిస్ వాహనం కోసం దీన్ని తీసుకున్నాడు. ఒక కారు నంబర్ కు ఇంత పలకడం ఇదే మొదటి సారి. దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కలిగిన వ్యక్తిగా కిరణ్ కోల్పాకుల రికార్డు సృష్టించారు

గతంలో ఈ సంస్థ HR 88 B 8888 అనే ఫ్యాన్సీ నెంబర్ ను వేలం వేస్తే హర్యానా వ్యక్తి 1.17 కోట్లకు బిడ్ వేశాడు. అయితే ఆ వ్యక్తి డబ్బులు చెల్లించడంలో విఫలం కావడంతో దాని మరోసారి వేలం వేస్తే అది 26 లక్షల 70000 మాత్రమే ధర పలకడం  గమనార్హం.


తెలంగాణ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ డీలర్ల సంఘం 2026

 తెలంగాణ ఫెర్టిలైజర్స్ ,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ,

2026 నూతన కార్యవర్గం ,

అధ్యక్షులు.. నాగుర్ల వెంకటేశ్వర్లు,

 ప్రధాన కార్యదర్శి.. రామడుగు మనోహర్,

 కోశాధికారి ..సిద్ధి నాగరాజు.

బోధన్ కమ్మ సంఘం 2026 నూతన కార్యవర్గం

 బోధన్ కమ్మ సంఘం ,

2026 నూతన కార్యవర్గం ,

జిల్లా నిజామాబాద్ ,

తెలంగాణ .

అధ్యక్షులు .. పల్లెంపాటి శివన్నారాయణ ,

ఉపాధ్యక్షులు .. డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి, ఆది నారాయణ, వెలగ తిలక్,

ప్రధాన కార్యదర్శి.. హరినాథ్ బాబు,

 కోశాధికారి.. పల్లెం పాటి శ్రీధర్,

సంయుక్త కార్యదర్శి..ఎలవర్తి రవీంద్ర బాబు, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాసరావు.

కరడ్ పల్లి రెడ్డి సంఘం 2026 కార్యవర్గం

కరడ్ పల్లి రెడ్డి సంఘం ,

నూతన కార్యవర్గం 2026 ,

 తాడ్వాయి మండలం ,

 జిల్లా కామారెడ్డి ,తెలంగాణ.


అధ్యక్షుడు.. కొమ్ముల రాజిరెడ్డి,

కార్యదర్శి..నల్లవెల్లి  మోహన్ రెడ్డి,

కోశాధికారి..Lic రాజిరెడ్డి.


2, ఫిబ్రవరి 2026, సోమవారం

బీర్కూర్ మున్నూరు కాపు సంఘం 2026

 బీర్కూర్ మున్నూరు కాపు సంఘం ,

2026 నూతన కార్యవర్గం,

జిల్లా కామారెడ్డి,

తెలంగాణ.

అధ్యక్షులు.. పోతుల వెంకటేష్, 

ఉపాధ్యక్షులు ..బసెట్టి ,

క్యాషియర్ ..శ్రీనివాస్ ,

సంయుక్త కార్యదర్శి ..గంగాధర్ ,

కార్యదర్శి ..అనిల్.

దస్తూరాబాద్ మండల సర్పంచ్ ల ఫోరం 2026

అధ్యక్షులు ..మున్యాల్ సర్పంచ్ కట్కూరి లలితా రాజేష్,

 ఉపాధ్యక్షులు ..మెస్రం సురేందర్ , ఎండపెల్లి గంగన్న,

 ప్రధాన కార్యదర్శి ..కోలా మహేష్,

 గౌరవ అధ్యక్షులు.. గుండా నరేష్,

సలహా దారులు..పద్మ కళ్యాణ్ ,నరేశ్.. సర్పంచ్ లు రాజేష్, అజ్మీరా బురాన్, వార్దెళ్లి గోపాల్, జాడి మాధవి శంకర్ పాల్గొన్నారు.

సారంగాపూర్ మండల్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్

 సారంగాపూర్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్,  

జిల్లా నిర్మల్ ,తెలంగాణ.

 2026 నూతన కార్యవర్గం

అధ్యక్షులు .. కొత్తపల్లి గంగాధర్ 

ఉపాధ్యక్షులు ..దాసరి మల్లేష్

గౌరవ అధ్యక్షులు ..దండు సాయన్న 

ప్రధాన కార్యదర్శి.. కొత్తపల్లి విలాజి 

కోశాధికారి.. పాల్ది గణేష్ 

సంయుక్త కార్యదర్శి ..కామోజీ రాజేంద్రప్రసాద్

 కార్యవర్గ సభ్యులు ..ఎం సత్యనారాయణ, రాజ వర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీరామోజీ సాయన్న

29, జనవరి 2026, గురువారం

రాకేష్ కూల్ డ్రింక్స్ అండ్ బేకరీ దోమకొండ

 రాకేష్ కూల్ డ్రింక్స్ అండ్ బేకరి,

సంగమేశ్వర్ రోడ్,

దోమకొండ..

జిల్లా కామారెడ్డి 


మా వద్ద బర్త్ డే కేక్స్ ఆర్డర్ పై తయారు చేయబడును .బర్త్ డే జరుపుకొనుటకు అన్ని రకముల సౌకర్యము కలదు.

ప్రొప్రైటర్ ..ఊరే రాకేష్ ..సెల్ నంబర్..9553584882




11, జనవరి 2026, ఆదివారం

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం దోమకొండ, 14-1-2026 ,

 శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవము. తేదీ 14 జనవరి 2026 బుధవారం రోజున. 

ముఖ్య అతిథులు 

గౌరవనీయులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు శాసనసభ్యులు కామారెడ్డి నియోజకవర్గం.. 

గౌరవ అతిథులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులు

అతిథులు 

 గౌరవనీయులు శ్రీ సురేష్ షెట్కర్ గారు పార్లమెంటు సభ్యులు జహీరాబాద్

శ్రీ ఐరేని నరసయ్య గారు సర్పంచ్ దోమకొండ, శ్రీ బొమ్మెర శ్రీనివాస్ గారు ,ఉప సర్పంచ్ శ్రీ కదిరె గోపాల్ రెడ్డి గారు ఏఎంసీ  డైరెక్టర్ ,సర్వ శ్రీ వార్డు సభ్యులు జిపి దోమకొండ 

ఆలయ కమిటీ చైర్మన్ బుర్ర బాపురెడ్డి, మాజీ చైర్మన్ లింగ రాజేందర్, అర్చకులు.. బ్రహ్మశ్రీ బావి కృష్ణమూర్తి శర్మ, శ్రీ రామకృష్ణ శర్మ 

ధర్మకర్తలు శ్రీ గాజులపల్లి చంద్రశేఖర్ రెడ్డి , శ్రీమతి ఆరేపల్లి గాయత్రి సంతోష్ , శ్రీ నగరం నరసింహులు 

స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి, తేదీ 14 జనవరి 2026 బుధవారం రోజున ఉదయం 11:15 నిమిషములకు అనురాధ నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవము జరుగును కావున భక్తులెల్లరు కి దైవ కార్యములో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము 

భక్తులకు గమనిక.. కళ్యాణమండ కూర్చునే భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించగలరని కోరుచున్నాము.

కార్యక్రమముల వివరాలు ఉదయం 11:15 నిమిషాలకు గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ దీపారాధన తదనంతరము శ్రీ గోదావరి రంగనాయకుల కళ్యాణోత్సవం అత్యంత వైభవముగా జరుగును . ఒడిబియ్యం, తీర్థప్రసాద వినియోగము అన్నదాన కార్యక్రమము జరుగును 

సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపు సేవా కార్యక్రమం జరిగును

అనంతరము స్వామి వారు ఆలయ ప్రవేశం తదుపరి షోడశోపచార పూజ హారతి మంత్రపుష్పం పల్లకి సేవ భజన కార్యక్రమము ఊన్జల్ సేవ జరుగును.

భక్తులకు గ్

తేదీ 15 జనవరి 2026 గురువారం ఉదయం 6 గంటల నుండి చక్రతీర్థం 

ఈ దైవ కార్యము నిర్వహించుటలో పాలుపంచుకుంటున్న దాతలకు మరియు భక్తులకు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారు ఆరోగ్య ఆయుర్ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నం.

 ఆహ్వానించు వారు .. దేవాలయ కమిటీ మరియు భక్తులు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం జిల్లా కామారెడ్డి