Sunday, 11 January 2026

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం దోమకొండ, 14-1-2026 ,

 శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవము. తేదీ 14 జనవరి 2026 బుధవారం రోజున. 

ముఖ్య అతిథులు 

గౌరవనీయులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు శాసనసభ్యులు కామారెడ్డి నియోజకవర్గం.. 

గౌరవ అతిథులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులు

అతిథులు 

 గౌరవనీయులు శ్రీ సురేష్ షెట్కర్ గారు పార్లమెంటు సభ్యులు జహీరాబాద్

శ్రీ ఐరేని నరసయ్య గారు సర్పంచ్ దోమకొండ, శ్రీ బొమ్మెర శ్రీనివాస్ గారు ,ఉప సర్పంచ్ శ్రీ కదిరె గోపాల్ రెడ్డి గారు ఏఎంసీ  డైరెక్టర్ ,సర్వ శ్రీ వార్డు సభ్యులు జిపి దోమకొండ 

ఆలయ కమిటీ చైర్మన్ బుర్ర బాపురెడ్డి, మాజీ చైర్మన్ లింగ రాజేందర్, అర్చకులు.. బ్రహ్మశ్రీ బావి కృష్ణమూర్తి శర్మ, శ్రీ రామకృష్ణ శర్మ 

ధర్మకర్తలు శ్రీ గాజులపల్లి చంద్రశేఖర్ రెడ్డి , శ్రీమతి ఆరేపల్లి గాయత్రి సంతోష్ , శ్రీ నగరం నరసింహులు 

స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి, తేదీ 14 జనవరి 2026 బుధవారం రోజున ఉదయం 11:15 నిమిషములకు అనురాధ నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవము జరుగును కావున భక్తులెల్లరు కి దైవ కార్యములో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము 

భక్తులకు గమనిక.. కళ్యాణమండ కూర్చునే భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించగలరని కోరుచున్నాము.

కార్యక్రమముల వివరాలు ఉదయం 11:15 నిమిషాలకు గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ దీపారాధన తదనంతరము శ్రీ గోదావరి రంగనాయకుల కళ్యాణోత్సవం అత్యంత వైభవముగా జరుగును . ఒడిబియ్యం, తీర్థప్రసాద వినియోగము అన్నదాన కార్యక్రమము జరుగును 

సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపు సేవా కార్యక్రమం జరిగును

అనంతరము స్వామి వారు ఆలయ ప్రవేశం తదుపరి షోడశోపచార పూజ హారతి మంత్రపుష్పం పల్లకి సేవ భజన కార్యక్రమము ఊన్జల్ సేవ జరుగును.

భక్తులకు గ్

తేదీ 15 జనవరి 2026 గురువారం ఉదయం 6 గంటల నుండి చక్రతీర్థం 

ఈ దైవ కార్యము నిర్వహించుటలో పాలుపంచుకుంటున్న దాతలకు మరియు భక్తులకు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారు ఆరోగ్య ఆయుర్ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నం.

 ఆహ్వానించు వారు .. దేవాలయ కమిటీ మరియు భక్తులు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం జిల్లా కామారెడ్డి

No comments:

Post a Comment