28, ఫిబ్రవరి 2024, బుధవారం

పీఎం సూర్య ఘర్ బిజిలి

 కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్ కోరారు దీనివల్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని తద్వారా రాష్ట్రంలో లక్షలాది విద్యుత్తు వినియోగదారులకు మేలు కలుగుతుందని చెప్పారు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్లో మంగళవారం పీఎం సూర్య ఘర్ బిజిలి యోజన అమలుపై జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోలార్ యూనిట్ల కాంట్రాక్టర్లు పాల్గొన్నారు వారికి ఈ సందర్భంగా అశోక్ కుమార్ పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని పెంచేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు

యాపులు లేని స్మార్ట్ ఫోన్

 స్మార్ట్ ఫోన్లు నానాటికి మరింత స్మార్ట్ గా మారుతున్నాయి వివిధ రకాల అప్లికేషన్స్ యాప్స్ సహాయంతో ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని తమ అరచేతిలోకి తెచ్చిపెడుతున్నాయి అసలు యాప్లతో అవసరమే లేని స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో త్వరలో ఇది కూడా కార్యారూపం దాల్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం స్పెయిన్ లోని బార్సి లోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో జర్మనీ సంస్థ డైయిష్ టెలికం భవిష్యత్తు తరం స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు మొబైల్ యాప్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పై ఆధారపడి పని చేయడం దీని ప్రత్యేకత డైస్ టెలికం తన టీ ఫోన్ డివైస్ పై ఈ కాన్సెప్ట్ ను ప్రదర్శించింది ఎలాంటి యాప్లు లేని యూజర్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉండే ఈ కాన్సెప్ట్ను స్మార్ట్ ఫోన్ చిప్ల తయారీ దిగ్గజం వాల్కమ్ తో కలిసి అభివృద్ధి చేసింది స్మార్ట్ఫోన్లో ఇతర డివైస్లలో యాప్లను వినియోగించడం క్రమంగా తగ్గిపోతుందని రానున్న ఐదు నుంచి పది ఏళ్లలో మనం యాప్ల వినియోగానికి పూర్తిగా స్వస్తి పలుకుతామని తాను గట్టిగా భావిస్తున్నట్లు డైస్ టెలికం కంపెనీ సీఈవో టీం హొట్గేస్ ఈ సందర్భంగా తెలిపారు

గొర్రెకు పాలిచ్చిన ఆవు

 గోమాత ఒక గొర్రె పిల్లకు మాత అయ్యింది తన జాతి భేదాన్ని మరిచి గొర్రె పిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చుతున్నది ఈ అరుదైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది అలంపూర్ నియోజకవర్గంలోని చండూరు గ్రామ శివారులోని ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్న గొర్రె పిల్ల తల్లి ఇటీవల మరణించింది దీంతో ఆ గొర్రెపిల్ల అక్కడే ఉన్న ఆవులమందలోని ఆవు పాలకు అలవాటు పడింది తరచూ ఆకలి తీర్చుకోవడానికి ఆవు చెంతకు చేరి పాలు తాగుతోంది ఆవు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా గొర్రెపిల్లకు పాలిచ్చే కడుపు నింపుతోంది