21, ఫిబ్రవరి 2024, బుధవారం

చైనా యువకుడికి 795 కోట్ల జాక్పాట్

 చైనా వెల్ఫేర్ లాటరీ లో ఓ యువ వ్యాపారి దేశంలోనే అత్యధిక బహుమతిని సొంతం చేసుకున్నారు. గుయిజావ్ ప్రావిన్స్  కి చెందిన ఈ చిరు వ్యాపారి లాటరీలో 795 కోట్ల 84 లక్షల రూపాయలు గెలుచుకున్నాడని నిర్వాహకులు తెలిపారు. ఆయన 133 టికెట్లను కొన్నారని ప్రతిసారి ఒకే గ్రూపునకు చెందిన ఏడు నెంబర్లపై పందెం కాసేవారని ప్రతి టికెట్కు దాదాపు 6 కోట్ల రూపాయల చొప్పున బహుమతి వచ్చిందని తెలిపారు .విజేత వివరాలను సంస్థ బయట పెట్టలేదు .గుర్తుతెలియని ఆ విజేత ఈనెల 7న బహుమతిని స్వీకరించేందుకు వచ్చారని తెలిపింది. విజేత స్పందిస్తూ ఉద్వేగ భరితంగ అయ్యానని నిద్ర పట్టలేదని చెప్పారు. బహుమతులో ఐదో వంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు కంపెనీ రాసిచ్చిన మిలియనీర్

 లాభాల కోసం కార్మికులను తొలగిస్తున్న ఈ రోజుల్లో అమెరికాలో ఒక సంస్థ యజమాని తన కంపెనీని కార్మికులకు రాసిచ్చాడు ఆయన పేరు బాబు మూర్.. బాబ్స్ రెడ్ మిల్ పేరిట  ఉన్న ఇతని కంపెనీలో ఇప్పుడు 700 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని యజమాని మిలియనీర్ అయిన మోర్ తన చిరకాల వాంఛను ఈ విధంగా నెరవేర్చుకున్నారు. ఇటీవలే 94 ఏళ్ల వయసులో మోర్ మరణించారు. అమెరికాకు చెందిన మోర్ ఈ సంస్థను 1978లో ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలతో నాణ్యమైన ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసే విక్రయిస్తుంది. సంస్థ ఆనతి కాలంలోనే అభివృద్ధి చెందడానికి ఉద్యోగులే కారణమని మూర్ ఎప్పుడు అభిప్రాయపడేవాడు .అందుకు తన కంపెనీలో వారికి యాజమాన్యం ఇవ్వాలనుకున్నాడు.

26 అడుగుల భారీ అనకొండ

 ఏకంగా 26 అడుగుల పొడవు ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద పామును పరిశోధకులు అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో గుర్తించారు టీవీ వన్యప్రాణి ప్రజంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ ఓంక్ ఈ భారీ అనకొండ ను నీటి అడుగున తిరుగుతుండగా కనిపెట్టారు 200 కిలోల బరువు ఉండే ఈ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద బరువైన పాముగా చెబుతున్నారు