9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ప్రొఫైల్ విద్యార్థులకు ఏఐ టిప్స్

 టోటల్ విద్యార్థుల అదనపు సాధన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టోల్ టెస్ట్ రెడీ ప్లాట్ఫారం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యార్థుల వ్యక్తిగత సాధనకు ఇది దోహదపడుతుందని టిప్స్ రూపంలో సలహాలు సూచనలు కూడా చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఫ్రీ పెయిడ్ ఆఫర్లను ఉపయోగించుకొని టోటల్ టెస్ట్ రెడీలో సాధన చేయవచ్చు టెస్ట్ రెడీ విలక్షణ వేదిక వ్యక్తిగత సాధనలో మెరుగులు దిద్దుకోవడానికి ఇది ఎంతగానో సహాయకారిగా నిలుస్తుంది అని ఈ టి ఎస్ కు చెందిన రోహిత్ శర్మ చెప్పారు

నేడు రేపు కరీంనగర్ లో మెగా ప్రాపర్టీ షో

 నేడు రేపు కరీంనగర్  మెగా ప్రాపర్టీ షో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో.. నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శుక్ర శనివారాల్లో కరీంనగర్ వేదికగా మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించి శనివారం రాత్రి ముగించనున్నారు

ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా లింగం

 కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా కంచర్ల లింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి ఎన్నికల కమిటీ నిర్ణయించిన ప్రకారం గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఐదు నామినేషన్ల స్వీకరించారు అధ్యక్ష స్థానం కోసం ఒక నామినేషన్ కార్యదర్శి స్థానానికి రెండు నామినేషన్లు కోశాధికారి స్థానానికి రెండు నామినేషన్ వచ్చాయి అధ్యక్ష పదవికి ఒక నామినేషన్ రావడంతో కంచర్ల లింగాన్ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు