9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

నేడు రేపు కరీంనగర్ లో మెగా ప్రాపర్టీ షో

 నేడు రేపు కరీంనగర్  మెగా ప్రాపర్టీ షో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో.. నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శుక్ర శనివారాల్లో కరీంనగర్ వేదికగా మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించి శనివారం రాత్రి ముగించనున్నారు

ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా లింగం

 కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా కంచర్ల లింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి ఎన్నికల కమిటీ నిర్ణయించిన ప్రకారం గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఐదు నామినేషన్ల స్వీకరించారు అధ్యక్ష స్థానం కోసం ఒక నామినేషన్ కార్యదర్శి స్థానానికి రెండు నామినేషన్లు కోశాధికారి స్థానానికి రెండు నామినేషన్ వచ్చాయి అధ్యక్ష పదవికి ఒక నామినేషన్ రావడంతో కంచర్ల లింగాన్ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

స్టోర్ జనరిక్ స్ భారీ డిస్కౌంట్లతో మెడ్ ప్లస్ మందులు

 భారీ డిస్కౌంట్లతో మెడ్ ప్లస్ మందులు..సొంతంగా తయారీవలననే సాధ్యం అన్న కంపెనీ..

తక్కువ ధరలకు మందులను అందుబాటులోకి తేవడానికి రిటైల్ ఫార్మసీ చైన్ మెడిప్లస్ స్టోర్ జనరిక్ అనే విధానాన్ని పరిచయం చేసింది సొంతంగా తయారు చేసిన మందులను 50 నుంచి 80% వరకు డిస్కౌంట్తో అమ్ముతున్నట్టు ప్రకటించింది ఈ మోడల్ కింద 4200 ఫార్మసీ స్టోర్లలో దాని సొంత బ్రాండ్ కు చెందిన 600కు పైగా ఆఫ్ పేటెంట్ మందులను అమ్ముతుంది స్టోర్ జనరిక్ అనేది అమెరికా వంటి దేశాల్లో విజయవంతంగా నడుస్తోంది ఈ విషయమై కంపెనీ సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ అకౌంట్స్ ఇండియా విండ్లాస్ బయోటెక్ వంటి ప్రఖ్యాత కాంట్రాక్టు డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ తో కలిసి పని చేస్తున్నాం వారి ప్లాంట్లలోనే మందులను తయారు చేస్తున్నాం మనదేశంలోని అన్ని టాప్ కంపెనీలు మందులకు ధీటుగా మా కంపెనీ మందులు ఉంటాయి ప్రమాణా లకు అనుగుణంగా ఇవి తయారవుతాయి మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఖర్చులు లేకపోవడం వల్ల మేం మెడిసిన్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం అని ఆయన వివరించారు తెలంగాణలో విజయవంతమైన తర్వాత మెడిప్లస్ ఇటీవల నెలల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమబెంగాల్ ఒడిశాలో స్టోర్ జనరిక్స్ ని ప్రవేశపెట్టింది