3, ఫిబ్రవరి 2024, శనివారం

అమెజాన్ స్వచ్ఛత స్టోర్ ప్రారంభ

 ఢిల్లీలోని అమెజాన్ స్వచ్ఛత స్టోరును కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ ప్రారంభించారు ఈ స్టోర్ ద్వారా లోకల్ సెల్లార్లు ఎస్ఎంఈలు తయారీదారులు నుంచే వ్యాక్యూమ్ క్లీనర్స్ శానిటరీ వేర్ వాటర్ ప్యూరిఫైయర్స్ మ్యాప్స్ చీపుండు వంటి వస్తువులు తక్కువ ధరలకే కొనొచ్చు ఇందులో 20 వేలకు పైగా వస్తువులుంటాయి అంతేగాక పరిశుభ్రత వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా అవగాహన కలిగిస్తారు.



వాలీబాల్ టోర్నీ విజేత బోర్లామ్ క్యాంప్

 బాన్సువాడ ఉద్దెన గంగప్ప స్మారకార్థం ఇబ్రహీంపేటలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో బోర్లాం క్యాంప్ జట్టు విజేతగా నిలిచింది శుక్రవారం గ్రామ పెద్దలు విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ కళావతి మాట్లాడుతూ గంగప్ప సర్పంచ్ గా గ్రామానికి ఎంతో సేవ చేశారన్నారు కార్యక్రమంలో ఆనంద్ వినయ్ రాజ్ కుమార్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.



కేబుల్ టీవీ ఆపరేటర్ల నూతన కార్యవర్గం

 కామారెడ్డి టౌన్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం 2024 ను శుక్రవారం నాడు ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ గా ఆకుల రవిరాజు వైస్ ప్రెసిడెంట్గా చంద్రకాంత్ జనరల్ సెక్రటరీగా భవానిపేట రాజు, సెక్రటరీగా సౌకతలి ట్రెజరర్ గా శేఖర్ యాదవ్ లన ఎన్నుకున్నట్లు తెలిపారు