3, ఫిబ్రవరి 2024, శనివారం

రాష్ట్ర స్థాయి పోటీలకు ఆదర్శ విద్యార్థి మాలతి ఎంపిక

 రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మాలతి ఎంపికయ్యారు ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో 76 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది ఈనెల 3 4 5 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో జరిగే అండర్ 17 పోటీల్లో పాల్గొన్నట్లు ఫిజికల్ డైరెక్టర్ తెలిపారు విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్ బలరాం ఫిజికల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అభినందించారు.



స్వర్ణకార సంఘం ఎన్నికలు

 బోధన్ పట్టణంలోని విశ్వకర్మ భవనంలో శుక్రవారం స్వర్ణకార సంఘం  2024 ఎన్నికల నిర్వహించారు ఎన్నికల్లో

 అధ్యక్షులుగా - శ్రీపాదోజ్వార్ జనార్ధన్

 ప్రధాన కార్యదర్శిగా - త్రివేణి నాగరాజు చారి

 కోశాధికారిగా - మల్లేశ్వరం నారాయణ చారి

 ఉపాధ్యక్షులుగా - బొప్పాపురం హనుమాన్ చారి 

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో 

జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు - తంగళ్ళపల్లి శ్రీనివాసచార, 

కమిటీ సభ్యులు - మారోజు మురహర చారి, మారోజు సుధాకర్ చారి, సుంకోజు హరికాంత్ చారి ,కన్నోజ్వర్ బాలాజీ చారి ,సల్లూర్ వార్ అశోక్ చారి, కాళిదాస్ చారి, ప్రభాకర్ చారి ,నా రోజు రమణాచారి, ఎర్రోజు భాస్కరాచారి ,రాజశేఖర్ చారి, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.



కాంతి హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్

 ఆర్మూర్ పట్టణంలోని కాంతి హై స్కూల్ శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తామే స్వయంగా తయారు చేసిన వంటకాలను స్టాల్స్ లో ప్రదర్శించి విక్రయించారు ఈ సందర్భంగా కాంతి హై స్కూల్ కరస్పాండ్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ అమ్మ చేతి వంట యొక్క ప్రాముఖ్యతను వంట గదిలో అమ్మ పడే కష్టాన్ని పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అలాగే వ్యాపార విలువలు మరియు లాభనష్టాల పేరేజ్ గురించి పిల్లలకు ఈ వయసులోని అవగాహన వచ్చేటట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో 100కు పైగా చెట్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.